మావోయిస్టు పార్టీకి మరో దెబ్బ... టెక్ శంకర్ ఎన్‌కౌంటర్

ఠాగూర్
గురువారం, 20 నవంబరు 2025 (09:15 IST)
మవోయిస్టు పార్టీకి మరో తేరుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ జోనల్ కమిటీ సభ్యుడు, టెక్నికల్ టీమ్ ఇన్‌చార్జి మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ (51) ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.
 
ఏపీలోని ఏజెన్సీ జిల్లా అయిన అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని జీఎంవలస వద్ద బుధవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన మృతి చెందాడు. ఐఈడీలు, మందుపాతరల తయారీలో టెక్ శంకర్ దిట్టగా పేరుపొందారు. 
 
ఇటీవల హతమైన అగ్రనేత హిడ్మా నేతృత్వంలో జరిగిన అనేక దాడులకు ఈయనే సాంకేతిక సహకారం అందించినట్లు తెలుస్తోంది. ఈ యేడాది జూన్ ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి (ఉదయ్) మరణించడంతో, పార్టీ పునర్నిర్మాణం కోసం కేంద్ర కమిటీ శంకర్‌ను ఏవోబీకి పంపింది. కీలక సమయంలో ఆయన మృతి చెందడం పార్టీకి కోలుకోలేని నష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన జోగారావు, 36 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. 30 ఏళ్ల క్రితం ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామి రెడ్డి హత్య కేసుతో పాటు, అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల హత్య కేసుల్లోనూ ఈయన కీలక పాత్రధారి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments