Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు రాజీనామా చేసి మ‌ళ్లీ గెల‌వండి, టీడీపీ మూసేస్తాం!

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (18:06 IST)
మోసం చేశారు... అందుకే గెలిచారంటూ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో వైసీపీ గెలుపును ఎద్దేవా చేశారు.  విశాఖలో మోసం చేసి గెలిచారు, దాచేపల్లిలో అనేక ఇబ్బందులు పెట్టార‌ని అయ‌న విమ‌ర్శించారు. దాచేపల్లిలో 2, 3 స్థానాల ఫలితాలు తారుమారు చేశార‌ని, మ‌రి దర్శి, జగ్గయ్యపేట, కొండపల్లిలో వైసీపీ ఎందుకు గెలవలేద‌ని ప్ర‌శ్నించారు. బుగ్గన సొంత వార్డులో టీడీపీ గెలిచింద‌ని, ఈ ఫలితాలు చూస్తుంటే ప్రజల్లో మార్పు వచ్చింద‌న్నారు. త‌మ‌కు 12 శాతం ఓట్లు పెరిగాయ‌ని అచ్చెన్నాయుడు ధీమా వ్య‌క్తం చేశారు.
 

 
జగ్గయ్యపేట కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే ఎలా వెళ్తారు? అని అచ్చెన్న ప్ర‌శ్నించారు. అస‌లు కుప్పం గెలుపును ఎవరూ లెక్కలోకి తీసుకోవడం లేద‌ని, ప్రభుత్వం, పోలీసులు, డబ్బు పంపిణీ వల్లే కుప్పంలో గెలుపు వ‌చ్చింద‌న్నారు. మంత్రులు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేట‌ని, దొంగ ఓట్లతో గెలిచి మంత్రులు బోకేలు ఇచ్చుకోవడం దారుణం అన్నారు. టీడీపీ కార్యకర్తలు చేసిన పోరాటాన్ని అభినందిస్తున్నాం అని, వైసీపీతో హోరాహోరీ ఫైట్ చేశాం అని చెప్పారు. 

 
అస‌లు ఈ డీజీపీ లేకపోతే వైసీపీ గెలిచేది కాద‌ని, కొద్ది రోజుల్లో చంద్రబాబు అసలు సినిమా చూపిస్తార‌ని అన్నారు. ఈ 7 నెలల్లో టీడీపీ ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింద‌ని, మంత్రి వెల్లంపల్లికి దమ్ముంటే రాజీనామా చేసి మ‌ళ్ళీ గెలవగలరా? అని ప్ర‌శ్నించారు. వైసీపీ నేతలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాల‌ని, మీరు మళ్లీ గెలిస్తే మా పార్టీ మూసేస్తాం అని స‌వాలు చేశారు. వ్యవస్థల్ని వైసీపీ నిర్వీర్యం చేస్తోంద‌ని, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంద‌ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments