Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లోకేష్ కుప్పంలో స్ట్రాంగ్ ఏజెంట్లను పెట్టారు కదా... దొంగ ఓట్లు ఎలా?

లోకేష్ కుప్పంలో స్ట్రాంగ్ ఏజెంట్లను పెట్టారు కదా... దొంగ ఓట్లు ఎలా?
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 16 నవంబరు 2021 (15:49 IST)
కుప్పం ప్రజల్లో మార్పు వచ్చింద‌ని, వారంతా ఇపుడు వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నార‌ని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. టీడీపీ వారు వైఎస్సార్‌సీపీ దొంగ ఓట్లు వేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నార‌ని, అసలు ఓటరు ఐడీ లేకుండా ఓటరు పోలింగ్ బూతులోకి ఎలా వెళ్లగలరు?  చంద్రబాబు కట్టుకథలు అల్లుతున్నారు. లోకేష్ రెండు రోజులు పర్యటించి స్ట్రాంగ్ ఏజెంట్లను పెట్టుకున్నారు కదా? మరి ఎలా దొంగ ఓట్లు వేయగలరు? అని క‌న్న‌బాబు ప్ర‌శ్నించారు.

 
మూడు రాజధానుల విషయమై కోర్టులకు వెళ్లి ఆపాలని చూస్తున్నార‌ని, మూడు రాజధానులు చేయటం మీ తరం కాదని ఇప్పుడు మాట్లాడుతున్నార‌ని మంత్రి విమ‌ర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని మీరు ఎందుకు కట్టలేకపోయారు?  చంద్రబాబు అమరావతి రైతులను మోసం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు. మా నిర్ణయాలను ప్రజలు అంగీకరిస్తున్నారు. మూడు రాజధానులను అడ్డుకుంటే మిగతా ప్రాంతాల ప్రజలు సరైన బుద్ది చెప్తార‌ని క‌న్న‌బాబు చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి అక్కర్లేదనుకుంటే బీజేపీ కూడా సపోర్ట్ చేసుకోవచ్చు. కర్నూలే రాజధాని అన్న నాయకులు ఇప్పుడు ఏమయ్యారు?  అని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. 
 
 
చంద్రబాబు హయాంలో రైతులకు ఎప్పుడు పరిహారం ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేది. కానీ జగన్‌ రైతుల పక్షాన నిలబడతారు. అందుకే ఎప్పటికప్పుడు పరిహారాన్ని అందిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గులాబ్‌ తుఫాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ.22 కోట్ల పంట నష్ట పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.


ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ,  'గులాబ్‌ తుఫాను బాధిత రైతులకు పరిహారం ఇచ్చాం. నివర్‌ తుపాను బాధితులకు కూడా అప్పుడే పరిహారం ఇచ్చేశాం. చంద్రబాబు హయాంలో రైతులకు ఎప్పుడు పరిహారం ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేది. కానీ జగన్‌ రైతుల పక్షాన నిలబడతారు. అందుకే ఎప్పటికప్పుడు పరిహారాన్ని అందిస్తున్నారు. వారం పదిరోజులుగా జరుగుతున్న నష్టాన్ని కూడా అంచనా వేస్తున్నాం అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్యో, సుశాంత్ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి