పేపర్ బాయ్‌గా అవతారమెత్తిన టీడీపీ ఎమ్మెల్యే

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (09:36 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేపర్ బాయ్‌గా అవతారమెత్తాడు. ఆయన ఆదివారం ఉదయం ప్రతి ఇంటింటికి వెళ్లి దినపత్రికలను పంపిణీ చేశారు. వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఆయన పేపర్ బాయ్‌గా అవతారమెత్తాడు. ఆదివారం వేకువజామునే పట్టణంలోని మావుళ్ళమ్మపేటకు చేరుకున్న ఆయన స్థానిక పేపర్ బాయ్స్‌తో కలిసి వాటిని చందాదారులకు పంపిణీ చేసేందుకు సమాయత్తమయ్యారు. ఒక సైకిల్‌పై పత్రికలకు పెట్టుకుని 31వ వార్డులోని నాగరాజుపేట, తదితర ప్రాంతాల్లోని చందాదారుల ఇంటికి వెళ్లి పేపర్ వేశారు. 
 
టిడ్కో ఇళ్లళో మిగిలిన పది శాతం పనులు పూర్తి చేసి వాటిని ఇవ్వడంతో ప్రభుత్వం చేస్తున్న జాబ్యాన్ని లబ్దిదారులకు వివరించేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు ఆయన తెలిపారు. 
 
ఆయా ప్రాంతాల్లో పత్రికలు తీసుకోవడానికి వచ్చిన వారికి ప్రభుత్వ తీరును, పట్టణవాసులకు పది కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు కేటాయించిన విధానాన్ని వివరించారు. 
 
ప్రతి నెలా నాలుగు రోజులు చందాదారులను కలిసి ఇలా దినపత్రికలు అందిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెలియజేస్తానని, మరో నాలుగు రోజులు పారిశుద్ధ్య పనులు చేపట్టి నిరసనకు దిగుతానని ఎమ్మెల్యే రామానాయుడు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments