ఆషాఢ అమావాస్య రోజున శివుని ఆరాధనతో పాటు పార్వతీ దేవి, తులసి, రావి చెట్టును పూజిస్తారు. పూర్వీకులకు ఈ రోజున పూజలు చేయడం వల్ల వారి ఆశీస్సులు కూడా లభిస్తాయి.
సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. ఉపవాసం పాటించాలి. ఆపై శివపార్వతులను పూజించాలి. ఈ రోజు దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ రోజు అవసరమైన వారికి దానం చేయండి. ఆషాఢ అమావాస్య రోజున రుద్రాభిషేకం చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది.
ఆషాఢ అమావాస్య రోజున మొక్కలు నాటడం మంచిది. ముఖ్యంగా రావి, తులసి, బిల్వపత్ర, ఉసిరి, అరటి వంటి పవిత్రమైన మెుక్కలను నాటుతారు. ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.