Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 ఎన్నికలు.. సాక్షిపై చర్యలు తీసుకోండి.. దివ్యవాణి ఫిర్యాదు

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (11:03 IST)
2019 ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా పనులు మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించి తమ పార్టీలోకి చేర్చుకోవడం చేస్తున్నాయి. పలువురు నేతలు గోడ మీద పిల్లుల్లా కాచుకుని జంప్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి పత్రికను వీధుల్లో, పార్కుల్లో ఉచితంగా పంచుతున్నారంటూ టీడీపీ మండిపడుతోంది. 
 
ఈ క్రమంలో రూ.60లక్షల ఖర్చును జగన్ ఖాతాలో రాయాలంటూ.. ఎన్నికల సంఘాన్ని టీడీపీ కోరింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. సాక్షి పత్రికలో రిటైర్డ్ సీఎస్ అజయ్ కల్లంతో వ్యాసం రాయించి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారంటూ దివ్యవాణి ఆరోపించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలంటూ సీఈసీని కోరారు.
 
ఇదిలా ఉంటే.. అనంతపురం జిల్లా టీడీపీలో టికెట్ల కేటాయింపులు చిచ్చు రేపుతున్నాయి. రాయదుర్గం ఎమ్మెల్యే టికెట్ ను మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించారు. ఈ నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేస్తామని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద్ రెడ్డిలు హెచ్చరించారు. 
 
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎంపీ దివాకర్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు ఇద్దరినీ బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఈ చర్చలు విఫలం కావడంతో టీడీపీకి మెట్టు గోవింద్ రెడ్డి రాజీనామా చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments