Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒళ్ళు బలిసిన పెత్తందారులకి, సైకో మందకి పేదల ఆకలి బాధ తెలియదు : టీడీపీ కౌంటర్

ఠాగూర్
ఆదివారం, 18 ఆగస్టు 2024 (13:00 IST)
ఇటీవల కృష్ణా జిల్లాలో గుడివాడ అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి వంశీ అనే వ్యక్తి జరిపిన సంభాషణను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన సోషల్ మీడియా తప్పుగా చిత్రీకరించి ట్రోల్ చేసింది. దీనిపై టీడీపీ ఘాటుగా స్పందించింది. జగన్ రెడ్డి, అతని సైకోలు హేళన చేస్తూ, ట్రోల్ చేస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబడుతూ వాస్తవ పరిస్థితిని వివరిస్తూ ట్వీట్ చేసింది. 
 
నిజంగా వంశీ అనే వ్యక్తి వాస్తవ పరిస్థితి ఇది.. కరోనా ముందు బట్టల షాపు ఉండేది. చక్కగా సాగిపోతున్న సంసారంలో, బట్టల షాపు అగ్ని ప్రమాదానికి ఆహుతైంది. ఒకవైపు కరోనా, మరోవైపు బయట ఉద్యోగాలు లేని పరిస్థితి. ఏ దిక్కుతోచని వంశీ, హైదరాబాద్ వెళ్లి, స్విగ్గీ, జొమోటోలో డెలివరీ బాయ్‌గా చేరాడు. తోటి ఉద్యోగులు ఇచ్చిన ప్రోత్సాహంతో, డబ్బులు వస్తాయని తాను చేసే పనులు యూట్యూబ్ వీడియోస్ చేశాడు. అదే అతను చేసిన పాపం.. కేఎఫ్‌సీలో తిన్నాడని, ఈ సైకో బ్యాచ్ ట్రోల్ చేశారు. 
 
స్విగ్గీ, జొమోటోలో డెలివరీ బాయ్స్ ఎదుర్కునే సమస్యలపై వంశీ చేసే వీడియోస్ ఈ సైకోలకి కనిపించ లేదు. తాను మళ్ళీ హైదరాబాద్‌లో బ్రతకలేక, గుడివాడ తిరిగి వచ్చి, చికెన్ బండి పెట్టుకున్నాడు. ఇవేమీ ఈ సైకో గాళ్ళకి అవసరం లేదు. కరోనా సమయంలో తను ఎదుర్కొన్న ఇబ్బందులు చెప్తూ, వంశీ చేసిన అనేక వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి.


 
 
జగన్ రెడ్డి.. అందరూ నీ లాగా ప్యాలెస్సుల్లో బ్రతక లేరు. నీ సైకోగాళ్ళ లాగా, నువ్వు పడేసే పేటీయం డబ్బుల కోసం బ్రతకరు. ఆత్మభిమానంతో పని చేసే వంశీ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. నీ లాంటి ఒళ్ళు బలిసిన పెత్తందారులకి, నీ సైకో మందకి, వంశీ లాగ కష్టపడే వాళ్ళని చూస్తే హేళన కలగటంలో ఆశ్చర్యం లేదు. మీరు పెత్తందార్లు కూడా కాదు. ఫాసిస్టులు... నీ కిందే అందరూ బ్రతికాలి, నువ్వు పడేసే ఎంగిలి మెతుకులతోనే బ్రతకాలి అనే బలుపు ఉన్న, ఫ్యాక్షనిస్టు మనస్తత్వం ఉన్న వాడివి. కొద్దిగా మనిషిలా బ్రతుకు.. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల పై పడి ఏడవకు అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments