Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెడ్ బుక్ అంటే ఏంటో వివరించిన మంత్రి నారా లోకేశ్ (Video)

nara lokesh

ఠాగూర్

, శుక్రవారం, 16 ఆగస్టు 2024 (10:53 IST)
గత ఐదేళ్లలో తాను ఎక్కడకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పిన మాట రెడ్ బుక్. ప్రతి మీటింగ్‌లోనూ ఎర్ర డైరీని చూపించేసి, ఈ రెడ్ బుక్‌లో పేరు ఎక్కితే భవిష్యత్‌లో కష్టాలు అనుభవించక తప్పదని ప్రభుత్వ అధికారులను హెచ్చరిస్తూ వచ్చారు. ఇపుడు అధికారంలోకి వచ్చారు. కానీ, రెడ్ బుక్‌ను మరిచిపోయారు. ఈ మాట స్వయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పదేపదే వ్యాఖ్యానిస్తూ, నారా లోకేశ్‌కు గుర్తు చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఆయన శుక్రవారం అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెడ్‌బుక్ అంటే, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదన్నారు. గత ఐదేళ్ల కాలంలో తాను పాల్గొన్న ప్రతి మీటింగ్‌లో ప్రజలకు రెడ్ బుక్ గురించి చెప్పాను. ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలని తీర్పు ఇచ్చారన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ భూమిని కబ్జా చేశాడు.. అతన్ని వదిలిపెట్టాలా? రేపు మద్యం స్కాంపై కూడా విచారణ జరుపుతాం.. అపుడు నిందితులుగా తేలేవారిని వదిలిపెట్టాలా అని ఆయన ప్రశ్నించారు. గత ఐదేళ్ల కాలంలో వైకాపా నేతలతో అంటకాగి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్ట ప్రకారం శిక్షిస్తామని నారా లోకేశ్ హెచ్చరించారు. 
 
అమరావతి రైలు మార్గ నిర్మాణానికి రైల్వే బోర్డు ఆమోదం 
 
నవ్యాంధ్ర రాజధాని అమరావతి రైలు మార్గం అనుసంధానం కోసం రూ.2,047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైనుకు సంబంధించిన డీపీఆర్ (సవివర ప్రాజెక్టు నివేదిక)కు రైల్వేబోర్డు అమోదం తెలిపిన తర్వాత నీతి ఆయోగ్ ఆమోదముద్ర వేసిందని మండల రైల్వే అధికారి(డీఆర్ఎం) రామకృష్ణ తెలిపారు. గుంటూరులోని రైలి విహార్ క్రీడా మైదానంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ గురువారం ఘనంగా జరిగాయి.
 
ఈ వేడుకల్లో భాగంగా, ముందుగా జాతీయ జెండాను ఎగురవేసి రైల్వే రక్షక దళం నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రామకృష్ణ మాట్లాడారు. ఈ మార్గంలో కృష్ణానదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మిస్తున్నామన్నారు. గుంటూరు - బీబీనగర్ రెండో లైను నిర్మాణానికి రూ.2,853 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇందులో 48 కి.మీ మార్గం నిర్మాణం పనులు వచ్చే నెలలో ప్రారంభమవుతాయన్నారు. 
 
గుంటూరు - గుంతకల్ మార్గంలో మొత్తం 400 కిలోమీటర్ల నిర్మాణంలో ఇంకా 100 కి.మీ మాత్రమే మిగిలిందన్నారు. నడికుడి - శ్రీకాళహస్తి మార్గంలో మొత్తం 308 కి.మీకి ఇప్పటివరకు 75 కి.మీ పూర్తయిందన్నారు. అమృత్ పథకం కింద 16 స్టేషన్ల అభివృద్ధికి రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గత ఏడాది డివిజన్ రూ.671 కోట్ల ఆదాయం ఆర్జించగా, ఈ యేడాది జులై వరకు రూ.208.713 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్ఎస్ఎల్వీ డీ3 ప్రయోగం సక్సెస్