నా అనుభవమంత లేదు నీ వయస్సు.. విర్రవీగడం కరెక్టు కాదు : జగన్‌కు బాబు కౌంటర్

Webdunia
గురువారం, 11 జులై 2019 (11:09 IST)
నా అనుభవమంత లేదు నీ వయస్సు లేదంటూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కౌంటరిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్న సమయంలో చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అంటూ జగన్ అన్నారు.
 
దీనిపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ మాట్లాడారు.. అధికారం ఉందని విర్రవీగడం కరెక్ట్ కాదన్నారు. బాబ్లీ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా పోరాడామని చెప్పుకొచ్చారు. నీటి పంపకాలు సున్నితమైన అంశమని.. నీటి సమస్యలపై మేం గతంలో పోరాడామని వెల్లడించారు. 
 
జగన్ వయసు.. నా రాజకీయ అనుభవంతనన్న చంద్రబాబు భావితరాల భవిష్యత్‌ను తాకట్టుపెట్టే అధికారం మీకు లేదంటూ ఫైర్ అయ్యారు. ఐదు కోట్ల మంది మీ నిర్ణయాలను చూస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు.. భారత్, పాక్‌లా తయారవుతాయని గతంలో అన్న జగన్.. ఆ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఎలా వెళ్లారంటూ జగన్‌ను చంద్రబాబు నిలదీశారు. 
 
అంతకుముందు.. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం జగన్ ప్రసంగిస్తూ, ఐదేళ్ల కాలంలో చంద్రబాబు చేసిందేమి లేదని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారన్నారు. మరి ఆ సమయంలో చంద్రబాబు ఇక్కడేం గాడిదలు కాశారని విమర్శలు చేశారు. 
 
అసలు చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తయిందా అని జగన్ ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించాలన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పారు. దీనికి చంద్రబాబు అధికారం ఉంది కదా అని విర్రవీగొద్దంటూ కౌంటర్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments