Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య కేసుపై వెంటనే విచారణ చేపట్టండి.. సుప్రీం చెంతకు లిటిగెంట్

Webdunia
గురువారం, 11 జులై 2019 (10:32 IST)
అయోధ్యలో రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూవివాదం కేసుపై వెంటనే విచారణ చేపట్టాలని ఓ లిటిగెంట్ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా ఆధ్వర్యంలోని మీడియేషన్ కమిటీ ఏర్పాటుతో ఒరిగిందేమీ లేదని గోపాల్ సింగ్ విశారద్ పిటిషన్ వేశారు. ఆయన తరపున అడ్వకేట్ నర్సింహ వాదనలు వినిపించారు. వెంటనే విచారణ చేపట్టేందుకు అప్లికేషన్ ఫైల్ చేశారా అని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్.. లాయర్‌ను ప్రశ్నించింది. 
 
మీడియేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు జస్టిస్ కలీఫుల్లా కమిటీకి ఆగస్టు 15 వరకు గడువిస్తూ సీజేఐ ఆధ్వర్యంలోని ఐదుగురు జడ్జీల కానిస్టిట్యూషన్ బెంచ్ మేలో ఉత్తర్వులు జారీ చేసింది. మీడియేటర్లు ఆశాభావంతో ఉన్నప్పుడు, ఆగస్టు 15 వరకు గడువు అడిగినప్పుడు ఇస్తే తప్పేముంది ఎన్నో ఏళ్లుగా ఈ వివాదం పెండింగ్‌లో ఉందని, ఎందుకు గడువు ఇవ్వరాదని సుప్రీంకోర్టు అప్పట్లో కామెంట్ చేసింది. 
 
మార్చి 8న జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలో మీడియేషన్ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఎనిమిది వారాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని సూచించింది. ఈ కేసులో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సున్ని వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లాకు సమానంగా పంచాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ ప్రోమో

'థామా' నుంచి నువ్వు నా సొంతమా పాట రిలీజ్

Geethamadhuri : కానిస్టేబుల్ లో గీతామాధురి పాడిన ధావత్ సాంగ్ కు ఆదరణ

Dil Raju: తేజసజ్జా తో దిల్ రాజు చిత్రం - ఇంటికి పిలిచి ఆత్మీయ వేడుక జరిపాడు

Anupam Kher: కాంతార ఛాప్టర్ 1 చూశాక మాటలు రావడంలేదు : అనుపమ్ ఖేర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments