సార్వత్రిక ఎన్నికల ముందు నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు పథకాలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకంపై నిషేధం విధించాలని సుప్రీంలో పిటిషన్ దాఖలైంది.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేశారని వివరించిన పిటిషనర్ పేర్కొన్నారు.
ఈ పథకాలను చట్టవిరుద్ధమైనగా రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని పిటిషనర్ విన్నవించారు.
ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకాలు లేకుండా మార్గదర్శకాలను రూపొందించాలని అందులో కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు... కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.