Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు తోక కత్తిరించిన నాయీ బ్రాహ్మణులు : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

చంద్రబాబు తోక కత్తిరించిన నాయీ బ్రాహ్మణులు : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
, మంగళవారం, 2 జులై 2019 (13:28 IST)
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణుల సమస్యలపై విజయవాడలోని వైయస్ఆర్సీపి రాష్ట్ర కార్యాలయంలో నాయీ బ్రాహ్మణుల రాష్ట్రస్థాయి అవగాహనా సదస్సు జరిగింది. ఈ సదస్సులో దేవాదాయ శాఖా మంత్రి  వెలంపల్లి శ్రీనివాసరావు, వైయస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 
 
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడిన దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయీ బ్రాహ్మణులను ఘోరంగా అవమానించారు. అందుకే నాయీ బ్రాహ్మణులంతా కలిసికట్టుగా.. చంద్రబాబు తోకలు కట్ చేశారు. నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. నాయీ బ్రాహ్మణుల సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరిస్తోంది. నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేలు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నాయీ బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించి.. వారి కోర్కెలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధంగా ఉన్నారు. 
 
జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతి కోసం ఏలూరులో సభ పెట్టి.. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన ఏకైక పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ ఇటువంటి డిక్లరేషన్ ఏ పార్టీ ఇంతకముందెన్నడూ ఇవ్వలేదు. బీసీల సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు.
మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. 
 
మల్లాది విష్ణు మాట్లాడుతూ, పాదయాత్రలో జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగానే ఆయన పరిపాలన సాగుతోంది. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో మెజార్టీ హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. టీటీడీ, ఇతర దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణుల ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, శాశ్విత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించి, ఉద్యోగ భద్రత కల్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. అని ఈ సమావేశంలో పార్టీ నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధవటం యానాదయ్య, తదితరులు మాట్లాడారు. నాయీ బ్రాహ్మణుల సమస్యలపై ఒక కమిటీని నియమించి అధ్యయనం చేయాలని వారు కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్ టెల్ 3జీ సేవలు నిలిపివేత.. కస్టమర్లు ఏం చేయాలంటే?