ప్రత్యేక ఆర్డినెన్స్‌తో రామాలయ నిర్మాణం : శివసేన

మంగళవారం, 18 జూన్ 2019 (15:36 IST)
శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆయన కోరారు. దేశంలోని 350 లోక్‌సభ మంది సభ్యులతోపాటు కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో రామాలయం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సామ్నా పత్రిక తన ఎడిటోరియల్‌లో పేర్కొంది. 
 
ఇటీవల శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో పాటు.. ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే, శివసేనకు చెందిన 18 మంది ఎంపీలు ఇటీవల అయోధ్యలోని రాంలాలాను సందర్శించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
రామాలయ నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ద్వారా ముస్లిం పార్టీలతో మాట్లాడి వారిని ఒప్పించడం ఒకటైతే అది విఫలమైతే ఆర్డినెన్స్ తీసుకవచ్చి రామాలయ నిర్మాణం చేపట్టడమే మార్గమని సామ్నా పత్రిక తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. 
 
అదేసమయంలో అన్ని రకాల చర్యలు విఫలమైతే పార్లమెంట్‌లో 350 మంది ఎంపీల మెజార్టీతో రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకుని రావాలని సామ్యా పత్రిక వ్యాఖ్యానించింది. పైగా, ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించే వారికి వ్యతిరేకంగా తీర్పునిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్యాకేజీ వద్దు.. హోదానే ముద్దు : అసెంబ్లీలో సీఎం జగన్ తీర్మానం