Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెంబర్‌ వన్‌ ఆస్పత్రిగా స్విమ్స్‌.. వైవీ సుబ్బారెడ్డి సూచన

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (17:14 IST)
శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌)ను నెంబర్‌ వన్‌ స్థాయి ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సూచించారు.

సోమవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంగమ్మ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈసందర్భంగా వైవీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆస్పత్రిలో పరిస్థితులను అధ్యయనం చేసి చేయాల్సిన పనులు, కావాల్సిన ఎక్విప్‌మెంట్సు గురించి ఓ నివేదిక రూపొందించాలని కోరారు.

ఆస్పత్రిని అత్యున్నత స్థాయి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటుందని సుబ్బారెడ్డి వ్యక్తం చేశారు. ప్రత్యేకించి క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యుత్తమ చికిత్స అందించేందుకు చేపట్టాల్సిన అంశాలను కూడా నివేదికలో పొందుపరచాలని సూచించారు.

రోగులకు చికిత్స అందించడంలో అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా ఎలాంటి పొరబాట్లకు తావివ్వకుండా ఆస్పత్రిని తీర్చిదిద్దాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments