Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హరిణిలో ఉచిత లాపరోస్కోపిక్ హెర్నియా క్యాంప్

Advertiesment
హరిణిలో ఉచిత లాపరోస్కోపిక్ హెర్నియా క్యాంప్
, శుక్రవారం, 16 ఆగస్టు 2019 (19:49 IST)
విజయవాడ పుష్పాహోటల్ సమీపంలోని హరిణి హాస్పిటల్స్ నందు ఈ నెల 31 వరకు ఉచిత లాపరోస్కోపిక్ హెర్నియా క్యాంప్ నిర్వహిస్తున్నట్లు హరిణి హాస్పిటల్స్ సి.ఇవో, ప్రముఖ గాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎన్.తిరుమలరావు శుక్రవారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఈ క్యాంప్లో భాగంగా ముందుగా అపాయింటమెంట్ పొందిన వారికి ఉచిత కన్సల్టేషన్, రక్తపరీక్షలు, ఆల్ట్రాసౌండ్ పరీక్షలపై 40 శాతం రాయితీ, ఆపరేషన్స్ పై 20 శాతం రాయితీ అందిస్తామని వివరించారు. హెర్నియా సమస్య పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకంగా మారుతుందని హరిణి హాస్పిటల్స్ సర్జికల్ గాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎ.దినకర్ రెడ్డి పేర్కొన్నారు.

సరైన సమయంలో చికిత్స చేయించుకుంటే హెర్నియా సమస్య నుండి శాశ్వత విముక్తి లభిస్తుందని అన్నారు. సాధారణంగా హెర్నియా ఉదరభాగంలోనూ, గజ్జల్లోనూ వస్తుందని, శస్త్రచికిత్సల అనంతరం ఆపరేషన్ చేసిన చోట హెర్నియా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రధానంగా కండరాల బలహీనత వల్ల హెర్నియా వస్తుందని, పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి పెద్దదిగా ఉండటం హెర్నియాకు కారణమని పేర్కొన్నారు.

ధూమపానం కూడా హెర్నియా సమస్యకు ప్రధాన కారణంగా నిలుస్తోందని అన్నారు. అన్ని వయసుల వారికి హెర్నియా వచ్చే అవకాశం ఉందని, వాపు, నొప్పి ఉన్నట్లయితే వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. లాపరోస్కోపీ విధానంలో శస్త్రచికిత్స చేసినట్లయితే హెర్నియా మళ్లీ వచ్చే అవకాశాలు తగ్గుతాయని, రోగులు త్వరగా కోలుకుని సాధారణ జీవనం గడపగలుగుతారని అన్నారు.

హరిణి హాస్పిటల్స్ నందు నిర్వహిస్తున్న ఉచిత హెర్నియా క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఎ.దినకర్ రెడ్డి కోరారు. ముందుగా అపాయింట్మెంట్ పొందిన 200 మందికి ప్రత్యేక రాయితీలు అందిస్తామని ఆయన తెలియజేశారు. లాపరోస్కోపిక్ హెర్నియా రిపేర్ చిన్న రంధ్రం ద్వారా శస్త్రచికిత్సఅని పేషెంట్ కు ఏవిధమైన రక్తస్రావంగాని శరీరం పై కోతగాని ఉండవు అన్నారు.

శస్త్రచికిత్స అనంతరం రెండోరోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వవచ్చునని తెలిపారు. అపాయింట్ మెంట్ పొందగోరువారు 94408 53344 నెంబరు నందుగాని, హాస్పిటల్ కార్యాలయం నందు సంప్రదించాలని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వసతి, అతిధి గృహ నిర్మాణానికి భూమిని కేటాయించండి.. మహరాష్ట్ర, కేరళ ప్రభుత్వాలను కోరిన ఏపీ దేవాదాయ శాఖ