ఆంధ్రప్రదేశ్ నుంచి షిరిడీ, శబరిమల ఆలయాలను సందర్శించే యాత్రికులు, భక్తులకు మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్రప్రభుత్వం నడుంబిగించింది.
ఈ క్రమంలో భాగంగా షిరిడీ, శబరిమలలో వసతి, అతిధిగృహ నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాల్సిందిగా మహరాష్ట్ర, కేరళ ప్రభుత్వాలను రాష్ట్రప్రభుత్వం కోరనుంది.
ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శిని ఆదేశించారు.
రాష్ట్రం నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు షిరిడీ, శబరిమల ఆలయాలను దర్శించుకుంటున్న క్రమంలో షిరిడీ సాయిబాబా సంస్ధాన్ ట్రస్ట్, శబరిమల ట్రావెన్‌కోర్ దేవస్ధానం ట్రస్ట్‌లతో, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దేవాదాయశాఖ ప్రత్యేక కార్యదర్శిని ఆదేశించారు.