Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గులాబీ జెండా ఓనర్షిప్ కోసం కొట్లాట... భట్టి విక్రమార్క ధ్వజం

గులాబీ జెండా ఓనర్షిప్ కోసం కొట్లాట...  భట్టి విక్రమార్క ధ్వజం
, ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (15:47 IST)
గులాబీ జెండా ఓనర్షిప్ కోసం కొట్లాట
రోగులను, ప్రజలను మర్చిపోయిన ప్రభుత్వం
ఆసుపత్రులను నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి
 
సెప్టెంబర్1 : తెలంగాణ రాష్ట్ర సమితిలో ఓనర్షిప్ కోసం నాయకులు కొట్లాడుకుంటూ ప్రజల సంక్షేమం, పేదల ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మరిచిపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు భూపాలపల్లి ధ్వజమెత్తారు. 
 
ఆదివారం ఉదయం భూపాలపల్లిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిని మాజీ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సీతక్క, జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు అయితా ప్రకాష్ రెడ్డి, ఐ.ఎన్.టి.యూ.సీ నేత జనక్ ప్రసాద్ తదితర నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి అంటే సహజంగా 250పై బడిన పడకలతో ఉంటుందని అన్నారు. 
 
కానీ ఇక్కడ మాత్రం పేరుకు భూపాలపల్లి జిల్లా కేంద్ర అసుపత్రి.. కానీ ఇక్కడ ఉన్నది కేవలం 6 పడకలు మాత్రమే అని భట్టి వివరించారు. ఈ జిల్లా ఏర్పడి దాదాపు మూడేళ్లు అవుతున్నా.. ఇంకా ఎటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడం, జిల్లా ఆసుపత్రిగా మార్చకపోవడం చాలా బాధాకరమైన విషయం అని విక్రమార్క అన్నారు. జిల్లాలను ఏర్పాటు చేశాం, అద్భుతాలను సృష్టిస్తున్నాం అంటున్న ప్రభుత్వానికి.. ఇక్కడి పరిస్థితులే చెంపపెట్టు అని భట్టి చెప్పారు. 
 
వైద్యులు ఎక్కడ
భూపాలపల్లి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కేవలం ఆరు పడకలు మాత్రమే ఉన్నాయని భట్టి వివరించారు. ఇక్కడ ఇన్ పేషంట్లు ఎవరూ లేరని, ఈ రోజు ఉదయం కేవలం ఒక్క ఓపీ వచ్చిందని భట్టి వివరించారు. ఇక్కడకు రోగుల రావాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయని అన్నారు.  ఇక ఏం.ఆర్.ఐ, సీ.టీ స్కాన్, ఎక్స్‌రే ప్లాంట్, ఈసీజీ లేవని.. ఇంతటి దుర్భర పరిస్థితులు ఎక్కడా ఉండవని అన్నారు. 
 
వైద్యులు ఎక్కడ?
ఆరుపడకల ఆసుపత్రికి ఉండాల్సిన కనీస వైద్యులు కూడా ఇక్కడ లేరని భట్టి విక్రమార్క చెప్పారు. ఒక డాక్టర్ నిలోఫర్ లో పనిచేస్తుండగా.. మరొకరు ఈరోజు వచ్చారని అన్నారు. ప్రసూతికోసం వచ్చే మహిళల కోసం ఉండాల్సిన గైనకాలజిస్టులు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరని అన్నారు. లాబ్ టెక్నీషియన్ ఎవరూ లేరని అన్నారు. 
 
స్టోర్ రూమ్‌గా ఆపరేషన్ థియేటర్
ఆపరేషన్ థియేటర్ అత్యంత దారుణ పరిటితుల్లో ఉందని భట్టి విక్రమార్క అన్నారు. ఆపరేషన్ థియేటర్‌ను స్టోర్ రూమ్‌గా మార్చిన పరిస్థితి ఇక్కడ ఉందని అన్నారు.
 
మందులు లేవు
భూపాలపల్లి పల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కుక్క, కోతి కాట్లకు గురవుతున్నారని.. అందుకు కావాల్సిన సిరంజీలు కూడా లేవని అన్నారు. అలా వచ్చిన రోగులకు సిరంజీలు బయట కొనుక్కుని తెచ్చుకుంటే ఇక్కడ ఇంజక్షన్ ఇస్తారని.. ఇది దుర్భరమైన పరిస్థితి అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్‌ మీట్‌ కామెంట్స్.. పవన్‌ది ద్వందవైఖరి..