Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం జిల్లాలో డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఎల్‌ఎల్‌ఆర్‌ల పరీక్షలు నిలుపుదల

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (13:13 IST)
అనంతపురం జిల్లాలో డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఎల్‌ఎల్‌ఆర్‌ల పరీక్షలు ఈనెల 10వ తేదీ వరకు నిలిపివేయనున్నట్లు డీటీసీ శివరాంప్రసాద్‌ పేర్కొన్నారు. ఇదివరకు ఏప్రిల్‌ మూడోవారం నుంచి గతనెలాఖరు వరకు డీఎల్‌, ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షలు నిలుపుదల చేశామన్నారు.

ప్రభుత్వం ఈనెల 10వతేదీ వరకు కర్ఫ్యూను పొడిగించడంతో అప్పటిదాకా డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షల నిర్వహణ ఉండదన్నారు. ఇదివరకే డీఎల్‌, ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షల కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్న వాహనదారులు నిర్దేశించిన తేదీ తర్వాత తిరిగి కొత్త తేదీకి బుక్‌ చేసుకోవాలని సూచించారు.
 
7లోపు ‘వాహనమిత్ర’కు దరఖాస్తు చేసుకోండి
వైఎ్‌సఆర్‌ వాహనమిత్ర పథకానికి అర్హులైన వాహన యజమానులు ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డీటీసీ శివరాంప్రసాద్‌ పేర్కొన్నారు. జిల్లాలోని స్థానిక వార్డు, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించి, అక్కడే తిరిగి అందించాలన్నారు.

గతేడాది లబ్ధిదారులతోపాటు తాజాగా దరఖాస్తు చేసుకునే ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌ యజమానుల్లో అర్హులైన వారికి రూ.10వేల చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఈనెల 15వ తేదీన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వాహన మిత్ర డబ్బు విడుదల చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని వాహన యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments