Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనంతపురం జిల్లాలో వెంటాడుతున్న బ్లాక్‌ ఫంగస్‌

Advertiesment
అనంతపురం జిల్లాలో వెంటాడుతున్న బ్లాక్‌ ఫంగస్‌
, బుధవారం, 26 మే 2021 (10:01 IST)
అనంతపురం జిల్లాను బ్లాక్‌ ఫంగస్‌ వెంటాడుతోంది. చికిత్స సమయంలో అత్యధికంగా స్టెరాయిడ్స్‌ వాడటం వల్ల ఈ వైరస్‌ బారిన పడుతున్నారని ఇప్పటికే వైద్య వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బాధితులు, చికిత్స కోసం ఆస్పత్రికి క్యూ కడుతున్నారు.

తొలుత హిందూపురం ప్రాంతంలో మొదలైన బ్లాక్‌ ఫంగస్‌ అలజడి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా బెంబేలెత్తిస్తోంది. హిందూపురంతో పాటు ధర్మవరం, పుట్టపర్తి, అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి, గుత్తి నియోజకవర్గాలలోని పలు ప్రాంతాల్లో ఈ బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డారు. ఇప్పటికే హిందూపురంలో ఇద్దరు ఈ ఫంగ్‌సతో ఇతర ప్రాంతాల్లో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

హిందూపురం ప్రాంతానికి చెందిన పలువురు బెంగళూరు, హైదరాబాద్‌, కర్నూలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ఇక అనంతపురానికి చెందిన పలువురు బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డారు. ఇప్పటికే జూనియర్‌ ఒకేషనల్‌ ప్రభుత్వ కళాశాలకు చెందిన ఓ లెక్చరర్‌ ఈ ఫంగస్‌ బారిన పడి బెంగళూరులో చికిత్స పొందుతున్నారు.

దాదాపు రూ20 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నట్లు సమాచారం. మరో వైపు జిల్లా సర్వజన ఆస్పత్రికి ఫంగస్‌ బాధితుల తాకిడి పెరిగిపోయింది. గత వారం రోజులుగా కేసులు వస్తున్నాయి. గత శనివారం వరకు ఈ ఆస్పత్రిలో 13 ఫంగస్‌ అనుమానిత కేసులు ఉన్నాయి. మంగళవారానికి ఈ ఫంగస్‌ బాధితుల సంఖ్య 40కి పెరిగింది. ఈ 40 మంది అనుమానితులు జిల్లా ఆస్పత్రి, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు.

కరోనాకు చికిత్స పొందిన వారందరూ ఇప్పుడు ఫంగస్‌ పేరు వింటేనే భయపడిపోతున్నారు. ఆ లక్షణాలు చిన్నగా కనిపించినా తమకు ఫంగస్‌ ఏమోనని టెన్షన్‌ పడుతున్నారు. గుట్టుగానే బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు అనంతపురంలోని పలువురు వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకుంటున్నారు.  కాగా బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు ఇప్పటి వరకు వైద్యులు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది.

దీనిపై ఏది అడిగినా వారిని అనుమాని తులుగా అడ్మిట్‌ చేసుకున్నాం నిర్ధారణకు ల్యాబ్‌కు పం పించాం అవసరమైన చికిత్సలు అందిస్తున్నాం అనే సమాధానం మాత్రం చెబుతున్నారు. కానీ ఫంగస్‌ అనుమానితులు మాత్రం తమకు అవసరమైన వైద్య సేవలు అందడం లేదని ఆందోళన చెందుతున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరులో చిరంజీవి తొలి ఆక్సిజన్