Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనంతపురం జిల్లా లీడ్ బ్యాంకు మేనేజరు గారికి పెనుకొండ రైతులు పంట రుణాలపై విన్నపం

Advertiesment
అనంతపురం జిల్లా లీడ్ బ్యాంకు మేనేజరు గారికి పెనుకొండ రైతులు పంట రుణాలపై విన్నపం
, గురువారం, 13 మే 2021 (11:27 IST)
పంట రుణాలపై మారిటోరియం మరియు వడ్డీ రాయితీ నిబంధనలు తారీకు తదితర సూచనలు నిబంధనలు సడలించినచో అటు రైతులకు మరియు బ్యాంకు ఉద్యోగస్థులకు సహకరించినట్లు అవుతుంది. కనుక ఈ కరోనా వ్యాధి ప్రభాల్యం వలన సతమాత అవుచున్న రైతులు మరియు వారికి సేవ చేస్తూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవాలందించుచున్న బ్యాంకు ఉద్యోగులకు సహకరించ వలసిన అవసరం మరియు భాద్యత ఎంతయినా వున్నది కావున లీడ్ బ్యాంకు మేనేజరు మరియు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అధికారులపై వున్నది కనుక జాప్యం లేకుండా మా మీద దయవుంచి వ్యవసాయ రుణాల మారిటోరియం మరియు వడ్డీ రాయితీలు తదితర నిబంధనలు సడలిస్తూ వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని వేడుకొంటున్నాము.
 
అలాగే ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ పనిరాజ్ సార్ మరియు ఫీల్డ్ ఆఫీసర్ రమణారెడ్డి సార్ గారు మరియు బ్యాంకు సిబ్బంది మా రైతులకు గత సంవత్సరం పెనుకొండ లో కరోనా తీవ్రత ఎక్కువగా వున్నందున చాలా బ్యాంకు లు పని చేయలేదు కానీ ఆంధ్రాబ్యాంక్ వారు రెండు నెలల్లో దాదాపు 3500 మందికి క్రాప్ లోన్స్ రెన్యువల్ చేసినారు అలాగే కోవిడ్ లోన్స్ 400 మంది రైతులకు ఇచ్చారు మరియు ఆవులు గేదెలు లోన్స్ 350 మందికి ఇచ్చారు అడిషనల్ లోన్స్ ఇన్ని ఇచ్చారు మీకు ప్రత్యేక ధన్యవాదములు సార్.
 
ఇప్పుడు మరల మా రైతులు గుంపులు గుంపులుగా రెన్యూవల్ కోసం వస్తుంటే కరోనా తీవ్రత ఎక్కువ ఉన్నందున మా రైతులు సంవత్సరం లోపల రెన్యూవల్ చేసుకొంటేనే ప్రభుత్వం నుండి వచ్చు రాయితీలు వస్తాయి అని ఇబ్బంది పడుచుంటే దానిని గమనించి ప్రతి రైతు నష్ట పోకూడదని మరియు కరోనా బారిన పడకూడదని రైతులకు బ్యాడికేరీలు కట్టించి క్యూ పద్దతిలో వచ్చేలా ఏర్పాటు చేస్తూ మరియు ప్రతి గంట గంటకు మైక్ లో జాగ్రత్తలు చెప్పుచున్నారు కానీ మా రైతులు అది మంచి కోసమే కదా అని బ్యాంకు వారికి సహకరించవలేనని కోరుకుంటూ మరియు మా రైతుల కోసం చాలా చాలా జాగ్రత్తలు తీసుకొని నందుకు బ్యాంకు మేనేజర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు సార్ అని ఆంధ్రాబ్యాంక్ &యూనియన్ బ్యాంకు రైతులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్కులే శ్రీరామ రక్ష - ఎన్‌-95 రకం వాడగలిగితే ఉత్తమం