Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిచ్చి వేషాలు వేయొద్దన్న తల్లి... ప్రియుడితో కలిసి తల్లిని చంపేసిన కుమార్తె!

Advertiesment
పిచ్చి వేషాలు వేయొద్దన్న తల్లి... ప్రియుడితో కలిసి తల్లిని చంపేసిన కుమార్తె!
, గురువారం, 13 మే 2021 (10:25 IST)
పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన తల్లిని ఓ కుమార్తె తన ప్రియుడితో కలిసి చంపేసింది. ఈ దారుణం విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రేమ మైకంలో కన్నతల్లినే కడతేర్చింది. తన ప్రియుడితో వేషాలు వేయొద్దని తల్లి హెచ్చరించినందుకు ఆ ప్రియుడితోనే కలసి ఆమె ఉసురు తీసేసింది. 
 
విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లిలో ఈనెల 6న లక్ష్మి (40) అనే మహిళ అనుమానాస్పద రీతిలో మృతిచెందినట్లు కేసు నమోదైంది. వైద్యులు మృతదేహాన్ని పరిశీలించి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. 
 
ఆ దర్యాప్తులో విస్తుగోలిపే నిజం బయటకు వచ్చింది. రూపశ్రీ అనే అమ్మాయి వరుణ్ సాయి అనే అబ్బాయిని ప్రేమించింది. అతనిని పెళ్లి చేసుకుంటానని తల్లికి చెప్పింది. కానీ, ఆ తల్లి కుమార్తె మాటను మన్నించలేదు. ఆ యువకుడిని పెళ్లి చేసుకోవడానికి ససేమిరా అంది. దీంతో రూపశ్రీ, వరుణ్ సాయి ఇద్దరూ కలసి ఆమెను చంపడానికి నిర్ణయించుకున్నారు.
 
ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లిని ప్రియుడి సాయంతో దిండుతో అదిమిపెట్టి చంపే ప్రయత్నం చేసింది రూపాశ్రీ. స్పృహ కోల్పోయిన తల్లి లక్ష్మి చనిపోయిందని ఆమె భావించింది. దీంతో ఆమె ప్రియుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత రూపశ్రీ ఏమీ తెలియనట్లు తండ్రికి సమాచారం ఇచ్చింది. కిందపడి తల్లి చనిపోయిందంటూ సహజ మరణంగా నమ్మబలికింది. అయితే, తండ్రి అక్కడి ఓ ఆర్‌ఎంపీ వైద్యుడికి సమాచారం ఇచ్చాడు. 
 
దీంతో అక్కడికి వచ్చిన ఆర్‌ఎంపీ డాక్టర్ ఇవ్వడంతో అతడు లక్ష్మిని పరిశీలించి ప్రాణం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె చనిపోయింది. ఆ డాక్టర్‌కు లక్ష్మి మరణం సహజమైనది కాదని అనుమానం వచ్చింది. అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు రూపశ్రీ, వరుణ్‌సాయిలను అరెస్టు చేసి జైలుకు పంపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చల్లని కబురు.. జూన్ ఒకటో తేదీ కంటే ముందే నైరుతి రుతుపవనాలు