Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో మే 31 వరకు డ్రైవింగ్ లైసెన్సుల టెస్టులు నిలుపుదల

Advertiesment
ఏపీలో మే 31 వరకు డ్రైవింగ్ లైసెన్సుల టెస్టులు నిలుపుదల
, సోమవారం, 26 ఏప్రియల్ 2021 (18:47 IST)
కరోన బారిన పడి అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఒకరి నుండి మరొకరికి సంక్రమించే కరోన వైరస్ వ్యాధి కావడంతో అనేకమందికి వ్యాధి సంక్రమించడమే కాకుండా వ్యాధి తీవ్రతను పెంచుతూ మరణాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో రవాణాశాఖ కార్యాలయాల్లో ప్రజలు ఎల్.ఎల్.ఆర్.లు, కొత్త డ్రైవింగ్ లైసెన్సుల పరీక్షల కొరకు ఎక్కువగా రాకపోకలు జరగటం వలన కరోన వ్యాధి అంటుకునే అవకాశం ఉంటుందన్నారు.

కరోన వ్యాధిని దృష్టిలో పెట్టుకొని, రవాణా కమిషనర్ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని రవాణాశాఖ కార్యాలయాల్లో మంగ‌ళ‌వారం వ‌చ్చే నెల మే 31 వరకు ఎల్.ఎల్.ఆర్.లు, కొత్త డ్రైవింగ్ లైసెన్సుల పరీక్షల స్లాట్‌లను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు డిటీసీ తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్నవారు మరల వేరొక తేదీల్లో స్లాట్ బుకింగ్ మార్చుకొనే అవకాశానికి వీలుకల్పిస్తున్నామన్నారు.

శాఖాపరంగా మొత్తం సర్వీసులను ఆన్‌లైన్‌లో aprtacitizen.epragathi.org. వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగిందని, ప్రజలకు ఏ విధమైన సమాచారం కావాలన్నా నేరుగా వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని, కార్యాలయాలకు రావలసిన పనిలేదని డిటిసి తెలిపారు. ఏదైనా అవసరమే రవాణా శాఖ కార్యాలయాలకు  వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి వెళ్లాలని డిటీసీ కోరారు.

ప్రజలను చేరవేసే రవాణా వాహనాలు ఎప్పటికప్పుడు కోవిడ్ నిబంధనల ప్రకారం నడపాలని సూచించారు. రవాణా వాహనాలకు త్రైమాసిక పన్నును ఈ నెల 30వ తారీకు వరకు చెల్లించే వెసులుబాటు ఉన్నప్పటికిని, కరోనా నైపథ్యంలో వచ్చే జూన్ 30వ తేదీ వరకు టాక్స్ కట్టుకోవడానికి గడువు తేదీని పొడిగించడం జరిగిందని డిటీసీ యం.పురేంద్ర వెల్ల‌డించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్: 'పీఎం కేర్స్ ఫండ్‌'తో ఎన్ని వెంటిలేటర్లు కొన్నారు? ఏపీ మెడ్‌టెక్ జోన్ ఒక్కటి కూడా ఎందుకు సరఫరా చేయలేకపోయింది?