Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉపాధి హామీ కింద రూ. 870 కోట్లు విడుదల చేసామన్న ఏపీ సర్కార్

Advertiesment
employment guarantee
, శనివారం, 24 ఏప్రియల్ 2021 (09:51 IST)
ఉపాధి హామీ పథకం కింద 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5 లక్షలలోపు విలువ చేసే పనులకు బిల్లులు చెల్లించేందుకు రూ.870 కోట్లు విడుదలకు బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ జారీ చేసినట్లు రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 
 
ఈ నెల 22న ఉత్తర్వులు ఇచ్చామని ప్రభుత్వం తరఫు న్యాయవాది సి.సుమన్‌ వెల్లడించారు. రూ.5 లక్షలలోపు విలువ చేసే పనులు సుమారు 7.27 లక్షల వరకు ఉన్నాయని చెప్పారు. రూ.5లక్షల పైబడి విలువ చేసే 60వేల పనులకు సంబంధించిన బిల్లులపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. 
 
ఆ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాస నం.. తదుపరి విచారణను జూలై 2కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ల ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యధరా సముద్రంలో బోటు మునక.. 130మంది మృతి