Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏంటీ? ఆక్సిజన్ తయారు చేసి కరోనా రోగులకు అందించడమేంటి?

Advertiesment
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏంటీ? ఆక్సిజన్ తయారు చేసి కరోనా రోగులకు అందించడమేంటి?
, శనివారం, 24 ఏప్రియల్ 2021 (09:07 IST)
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏంటీ?...ఆక్సిజన్ తయారు చేసి కరోనా రోగుల కు అందించడమేంటి? బొత్తిగా అర్ధమే కావడం లేదు కదూ...!!. వివరాల్లోకి వెళ్తే.... ఇనుమును తయారు చేసే క్రమంలో భూమిలో దొరికే హెమటైట్ లేదా ఫెర్రస్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఓర్(Fe2O3)ను స్టీల్‌గా మార్చాలి అంటే 2000 డిగ్రీల సెల్సీయస్ వద్ద బ్లాస్ట్ ఫర్నేస్‌లో దానిని మండించి కరిగించాల్సి వుంటుంది. 
  
ఈ ప్రక్రియలో కర్బన సమ్మెళనమైన "కోక్ "ను మరియు ఐరన్ ఓర్‌ను దానికి కాల్షియం కార్బోనేట్‌ను కలిపి మండిస్తూ ఇనుమును వేరు చేయడానికి ఆక్సిజన్‌ను రసాయన ప్రక్రియ కోసం ఫర్నేస్‌లోకి పంపుతారు.. అంటే హెమటైట్ ముడి ఖనిజం నుండి స్టీల్ వేరు కావడానికి ఆక్సిజన్ (O2) కావాలన్నమాట.
 
మరి దానికి కావలసిన ఆక్సిజన్ ఎక్కడినుండి తేవాలీ? అందుకే స్టీల్ ఫ్యాక్టరీ సొంతంగా ఆక్సిజన్ తయారీ యూనిట్‌ను నెలకొల్పుకుంది. సరిగ్గా ఈ ఆక్సిజన్ తయారీ యూనిట్ నుండే మనకు ఆక్సిజన్ తయారు చేసి కరోనా రోగుల ప్రాణాలు నిలపడానికి సరఫరా చేస్తోంది.

వాతావరణం లోని గాలిలో 21% ఆక్సిజన్ మరియు 78% నైట్రోజన్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. Air compressor ద్వారా గాలిని తీసుకొని మలినాలు వేరుచేస్తారు. ప్రత్యేక కోల్ టవర్ ద్వారా మలినాలు వేరు చేసి జియోలైట్ బెడ్‌తో నింపబడిన PSA generator ద్వారా నైట్రొజన్‌ను వేరు చేసి ఆక్సిజన్ సేకరిస్తారు. ఇలా పలుమార్లు శుధ్ధీకరించబడిన ఆక్సిజన్‌ను మెడికల్ ఆక్సిజన్‌గా సిలిండర్లలొ నింపి సరఫరా చేస్తారన్నమాట.
 
ఇదిలా వుంటే లిక్విడ్ నైట్రోజన్‌ను అతి శీతలీకారిణిగా వాడతారు. అంటే మన గ్రామాలలో మొన్నటివరకు "గోపాలమిత్ర"లు పెద్దపెద్ద ఫ్లాస్క్‌లు తీసుకొచ్చేవారు గుర్తుందా? మూత తీయగానే పొగలు వస్తుండేవి.. అదే లిక్విడ్ నైట్రొజన్ అన్నమాట. (పశువుల వీర్యాన్ని దీంట్లో నిల్వ చేస్తారు)
 
ఇదన్నమాట కధ...
"యాభైరెండు అంగుళాల ఛాతీ"కి కూడా అవసరమైతే ఊపిరిలూదడానికి సిద్దంగా ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు. ఏదేమైనా ఊపిరి తీయాలనుకున్న సంస్థే నేడు దేశప్రజలకు ప్రాణాలువాయువును అందించి ప్రజల ప్రాణాలు నిలబెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు....

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న‌ల్గొండ జిల్లాకు కేసీఆర్ బ‌ద్ద విరోధి: కోమటిరెడ్డి