జూన్ 30 వరకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (08:58 IST)
కరోనా కష్టకాలంలో ప్రయాణికులకు భారతీయ రైల్వే ఓ శుభవార్త చెప్పిది. ఈ నెలాఖరు వరకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లు.. కోవిడ్ మార్గదర్శకాలకు లోబడి నడుపనున్నట్టు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. 
 
ఈ ప్రత్యేక రైళ్ళ వివరాలను పరిశీలిస్తే, రైలు నంబరు 02449-02450 షాలిమార్ ‌- సికింద్రాబాద్‌ మధ్య నడిచే ప్రత్యేక రైలు జూన్ 9, 16, 23, 30 తేదీల్లో షాలిమార్‌‌లో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.55కి సికింద్రాబాద్‌‌కు చేరుకుంటుంది. 
 
తిరుగు ప్రయాణంలో జూన్ 11, 18, 25, జులై 2వ తేదీల్లో ఇదే రైలు సికింద్రాబాద్‌‌లో ఉదయం 4 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.05కి షాలిమార్‌ చేరుతుంది.
 
ట్రైన్ నంబరు 02469-02470 హౌరా-యశ్వంత్‌ పూర్‌ మధ్య నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు జూన్ 10, 17, 24వ తేదీల్లో హౌరాలో మధ్యాహ్నం 12.40కి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.40కి యశ్వంత్‌ పూర్‌‌కు చేరుకుంటుంది. 
 
ఇదే రైలు తిరుగు ప్రయాణంలో 13, 20, 27వ తేదీల్లో యశ్వంత్‌ పూర్‌‌లో ఉదయం 5.15కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.25కి హౌరాకు చేరుకుంటుంది.
 
రైలు నంబరు 03253-03254 పాట్నా-బనాస్‌వాడీ మధ్య నడిచే వీకెండ్ స్పెషల్ ట్రైన్‌ను జూన్ 10వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments