Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే

Advertiesment
South Central Railway
దేశంలో కరోనా వైరస్ దెబ్బకు అనేక రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఇయితే, ఇపుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా మెల్లగా పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కేంద్రంగా ఉండే దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను నడపడానికి సన్నద్ధమయ్యింది. ప్రయాణికుల సౌకర్యం కోసం పలు మార్గాల్లో ఈ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. 
 
ఇందులో సికింద్రాబాద్ ‌- షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌ (02450) ప్రతి శుక్రవారం.. ఈ నెల 11, 18, 25, జూలై 2న నడుస్తుందని తెలిపింది. అదేవిధంగా షాలిమార్ ‌- సికింద్రాబాద్‌ (02449) రైలు ప్రతి బుధవారం.. ఈ నెల 9, 16, 23, 30 తేదీల్లో సేవలు అందిస్తుందని అధికారులు వెల్లడించారు. 
 
హౌరా - యశ్వంత్‌పూర్‌ రైలు (02469) ప్రతి గురువారం అంటే… ఈ నెల 10, 17, 24 తేదీల్లో, యశ్వంత్‌పూర్ ‌- హౌరా రైలు (02470) ప్రతి ఆదివారం అంటే… ఈ నెల 13, 20, 27 తేదీల్లో నడుస్తాయన్నారు. ఇవన్నీ రిజర్వేషన్‌ రైళ్లేనని తెలిపారు. 
 
కాగా, ప్రతి గురువారం నడిచే పట్నా - బన్సావాడి రైలు (03253)ను ఈ నెల 10 నుంచి, ప్రతి ఆదివారం నడిచే బన్సావాడి-పట్నా రైలు (03254)ను ఈ నెల 13 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముందే వచ్చిన రుతుపవనాలు... ముంబైలో జోరువాన