Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రయాణికులు లేక 25 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే

Advertiesment
Corona Second Wave
, ఆదివారం, 2 మే 2021 (11:00 IST)
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఈ వైరస్ బారిన ప్రతి రోజూ లక్షలాది మంది పడుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ ప్రభావం రైల్వేపై పడుతోంది. ఫలితంగా సరైన ఆక్సుపెన్సీ లేని కారణంగా రైల్వేశాఖ రైళ్లను రద్దు చేస్తోంది. 
 
తాజాగా దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు నడిచే 25 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, రేణిగుంట, సికింద్రాబాద్‌, రేపల్లె, ఇతర స్టేషన్ల నుంచి వచ్చే రైళ్లను రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి మే 31వ తేదీ వరకు, మరికొన్ని జూన్‌ 2వ తేదీ వరకు రద్దయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు.
 
అదేవిధంగా ఈ నెల 2వ తేదీన బయలుదేరాల్సిన నాందెడ్ ‌- తాండూరు రైలును సికింద్రాబాద్‌ వరకే పరిమితం చేస్తున్నారు. 3న బయలుదేరాల్సిన తాండూరు - పర్బని ట్రెయిన్‌ను కూడా పాక్షికంగా రద్దు చేశారు.
 
రద్దయిన రైళ్ల వివరాలు
ట్రైన్‌ నంబర్‌ : 07520 - ఔరంగాబాద్ - నాందేడ్ ట్రైన్ ఈ నెల పది నుంచి 31వ తేదీ వరకు రద్దు..
ట్రైన్‌ నంబర్‌ : 07619 - నాందేడ్ - ఔరంగాబాద్‌ రైలు ఈ నెల 7 నుంచి 28వ తేదీ వరకు..
ట్రైన్‌ నంబర్‌ : 07409 -ఆదిలాబాద్ - నాందేడ్ రైలు ఈ నెల 02 నుంచి 31 వరకు రద్దు.
ట్రైన్‌ నంబర్‌ : 07410 - నాందేడ్ - ఆదిలాబాద్ రైలు ఈ నెల 2 నుంచి 31 వరకు..
ట్రైన్‌ నంబర్‌ : 02748 - వికారాబాద్ - గుంటూరు రైలు ఈ నెల 2 నుంచి 31 వరకు రద్దు చేశారు.
ట్రైన్‌ నంబర్‌ : 02747- గుంటూరు - వికారాబాద్ వరకు నడిచే రైలు కూడా ఈ నెల 2 నుంచి 31 వరకు..
ట్రైన్‌ నంబర్‌ : 02735 - సికింద్రాబాద్ - యశ్వంతపూర్ రైలు ఈ నెల 2 నుంచి 30 వరకు..
ట్రైన్‌ నంబర్‌ : 02736 - యశ్వంతపూర్ - సికింద్రాబాద్ రైలును ఈ నెల 3 నుంచి 31 వరకు రద్దు..
ట్రైన్‌ నంబర్‌ : 07407 - తిరుపతి - మన్నార్ గుడి సర్వీస్‌ ఈ నెల 2 నుంచి 30 వరకు..
ట్రైన్‌ నంబర్‌ : 07408 - మన్నార్ గుడి - తిరుపతికి ట్రైన్‌ ఈ నెల 3 నుంచి 31 వరకు..
ట్రైన్‌ నంబర్‌ : 07626 - రేపల్లె - కాచిగూడ ట్రైన్‌ను ఈ నెల 3 నుంచి జూన్‌ 1 వరకు..
ట్రైన్‌ నంబర్‌ : 07625 - కాచిగూడ - రేపల్లె ట్రై‌న్‌ను ఈ నెల 2 నుంచి 31 వరకు..
ట్రైన్‌ నంబర్‌ : 07252 - కాచిగూడ - గుంటూరు ట్రైన్‌ను ఈ నెల 3 నుంచి వచ్చే జూన్‌ 1 వరకు రద్దు.
ట్రైన్‌ నంబర్‌ : 07251 - గుంటూరు - కాచిగూడ రైలును ఈ నెల 2 నుంచి 31 వరకు..
ట్రైన్‌ నంబర్‌ : 07002 - సికింద్రాబాద్ - షిర్డీ సాయినగర్‌ సర్వీస్‌ను ఈ నెల 2 నుంచి 30 వరకు..
ట్రైన్‌ నంబర్‌ : 07001 - షిర్డీ సాయినగర్‌ – సికింద్రాబాద్ రైలు ఈ నెల 3 నుంచి 31 వరకు..
ట్రైన్‌ నంబర్‌ : 06204 - తిరుపతి - చెన్నై సెంట్రల్ ట్రైన్ ఈ నెల 02 నుంచి 30 వరకు..
ట్రైన్‌ నంబర్‌ : 06203 - చెన్నై సెంట్రల్ - తిరుపతి ట్రైన్ ఈ నెల 2 నుంచి 31 వరకు..
ట్రైన్‌ నంబర్‌ : 02204 - సికింద్రాబాద్ - విశాఖపట్నం రైలు ఈ నెల 3 నుంచి 31 వరకు..
ట్రైన్‌ నంబర్‌ : 02203 - విశాఖపట్నం - సికింద్రాబాద్ రైలును ఈ నెల 04 నుంచి జూన్‌ 1 వరకు..
ట్రైన్‌ నంబర్‌ : 07621 - ఔరంగాబాద్ - రేణిగుంట రైలును ఈ నెల 07 నుంచి 28 వరకు..
ట్రైన్‌ నంబర్‌ : 07622 - రేణిగుంట - ఔరంగాబాద్ స్పెషల్‌ రైలు ఈ నెల 08 నుంచి 29 వరకు..
ట్రైన్‌ నంబర్‌ : 07665 - పర్భని - నాందేడ్ స్పెషల్‌ ట్రైన్‌ను ఈ నెల 04 నుంచి జూన్‌ 2 వరకు రద్దు..
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాగర్‌లో కారు దూకుడు... 6592 ఓట్ల ఆధిక్యంలో తెరాస ఆధిక్యం