Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

corona second wave, కాజల్ అగర్వాల్ ఇంట్లో కూర్చుని గోళ్లు గిల్లుకోవడంలేదు...

Advertiesment
corona second wave, కాజల్ అగర్వాల్ ఇంట్లో కూర్చుని గోళ్లు గిల్లుకోవడంలేదు...
, శనివారం, 1 మే 2021 (09:54 IST)
కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. లక్షల్లో కేసులు, వేలల్లో మరణాల సంభవిస్తున్నాయి. అన్ని పరిశ్రమలపై దీని ప్రభావం పడింది. టాలీవుడ్ ఇండస్ట్రీ సైతం షూటింగులు ఆపేసింది. COVID కేసులు పెరగడంతో, సినిమా షూట్స్ ఆగిపోయాయి. కొంతమంది సినీ ప్రముఖులు ఈ వైరస్ బారిన పడ్డారు.
 
దీనిపై కాజల్ అగర్వాల్ స్పందించింది. కరోనా కారణంగా అంతా ఇళ్లకే పరిమితం అవుతున్నాం. కానీ ఇంట్లో కూర్చుని ఖాళీగా గోళ్లు గిల్లుకునే కంటే ఏదో ఒక పని చేయాలని చెపుతోంది. తనకు తెలిసిన అల్లికల పనిని ఇంట్లో కూర్చుని చేస్తున్నట్లు తెలిపింది.
 
"పరిస్థితి చాలా భయంకరంగా వుంది. మన చుట్టూ నిస్సహాయత, ఆందోళన భావన ఉంది. ఈ పరిస్థితుల్లో మన మనస్సులను ఏదో ఒకదానిపై కేంద్రీకరించడం, వర్తింపచేయడం చాలా ముఖ్యం, అది ఏదైనా కావచ్చు- ఆలోచన పరంగా కానీ సృజనాత్మకంగా కానీ. నేను ఇటీవల అల్లికలు మొదలుపెట్టాను. ఇది నాకు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది, ఇది మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది. ఇతరుల కోసం ఏదైనా సృష్టించే చర్య నిజంగా చికిత్సా విధానం అని నేను నమ్ముతున్నాను. మరి మీ ఖాళీ సమయంలో మీరు ఏమి చేస్తున్నారు? "

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోసం చేస్తున్న సాయిధ‌ర‌మ్ తేజ్!