Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు.. ఇకపై వర్షాలే వర్షాలు

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (08:46 IST)
ఈ యేడాది రుతుపవనాలు ముందుగానే ప్రవేశించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోకి ఈ రుతుపవనాలు ముందుగానే రావడం గమనార్హం. అరేబియా సముద్రంలో నైరుతి గాలులు బలపడటంతో రాష్ట్రంలో తుని వరకు, తెలంగాణలో భద్రాచలం, మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు ఉత్తర బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించాయి. 
 
అదేసమయంలో తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఈ నెల 11న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావాలతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం పశ్చిమ గాలుల ప్రభావం కాస్త తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 33-39 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. 
 
సీమ, దక్షిణ కోస్తాలో కొద్దిగా ఎండ, వేడి గాలులు ఉండగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. కాగా అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రుతుపవనాలు బలపడి చురుగ్గా మారనున్నాయి. బుధవారం పశ్చిమ గాలుల ప్రభావం కాస్త తగ్గింది. 
 
అదేసమయంలో రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 33-39 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. సీమ, దక్షిణ కోస్తాలో కొద్దిగా ఎండ, వేడి గాలులు ఉండగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. కాగా అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రుతుపవనాలు బలపడి చురుగ్గా మారనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments