Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడిసెకి ఏసీ.. అత్త కోసం అల్లుడి ఔదార్యం

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (16:30 IST)
ఇంటికి ఏసీ పెట్టించుకున్నారు అంటే.. కాస్తో, కూస్తో శ్రీమంతుల కుటుంబమే అనుకోవాలి. పల్లెటూర్లలో అయితే ఏసీ అనేది ఖచ్చితంగా లగ్జరీగా భావించే వ్యవహారమే. మాములుగా అయితే ఖరీదైన బంగళాలు, డాబాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కానీ పూరింట్లో మీరు ఎప్పుడైనా ఏసీ చూశారా? అయితే పైన ఫోటో చూడండి. 
 
ఇది ఎక్కడో జరిగింది కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీ నగర్‌లో జరిగింది. కొన్నేళ్లుగా అక్కడే నివసిస్తున్న ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మంచాన పడింది. దీంతో ఆమె నివశిస్తున్న గుడిసెకు హైటెక్ హంగులు అద్దాడు వృద్ధురాలి అల్లుడు. కూలర్‌ని ఏర్పాటు చేశాడు. ఒకవేళ ఎండ వేడి పెరిగితే ఆవిడ ఇబ్బంది పడుతుందేమో.. ఏసీ కూడా పెట్టించాడు. దీంతో.. అత్త ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
ప్రస్తుత కాలంలో తల్లీదండ్రులనే పట్టించుకోని వారున్న లోకంలో.. అత్తకి బాగాలేదని ఆమె కోసం సకల సౌకర్యాలు కల్పించి.. గుడిసెకు ఏసీ ఏర్పాటు చేయడాన్ని చూసి కాలనీవాసులు సదరు అల్లుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments