Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్ ఆటతీరుపై సానియా సెటైర్లు (video)

Advertiesment
World Cup 2019
, బుధవారం, 5 జూన్ 2019 (14:38 IST)
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా పాకిస్థాన్ జట్టు తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు కేవలం 105 పరుగులకే చేతులెత్తేశారు. ఆ తర్వాత మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 348 పరుగులు బాదారు. ఫలితంగా ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసింది. 
 
దీనిపై పాకిస్థాన్ కోడలు భారత టెన్నిస్ తార సానియా మీర్జా స్పందిస్తూ, 'పాకిస్థాన్ జట్టుకు శుభాభినందనలు. ఓ మ్యాచ్‌లో ఓటమిపాలైనా పుంజుకుని గెలుపు బాట పట్టడం అద్భుతం. పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఊహించలేమని అందరూ ఎందుకు అంటారో మరోసారి నిరూపితమైంది. క్రికెట్ ప్రపంచకప్ మరింత ఆసక్తికరంగా మారిందనడంలో ఎలాంటి సందేహంలేదు' అంటూ ట్వీట్ చేశారు. 
 
అయితే, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రదర్శించిన చెత్త ప్రదర్శనతో  పాకిస్థాన్ జట్టు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. పాక్ ఆటగాళ్లను అభిమానులు భయంకరంగా తిట్టిపోశారు. ఓవైపు మాజీలు, మరోవైపు కరుడుగట్టిన అభిమానులు పాక్ జట్టును ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టును ఓడించి పరువు నిలుపుకుంది. దాంతో ఎప్పట్లాగానే పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు శభాష్ అంటూ మెచ్చుకోళ్లతో హోరెత్తిస్తుండగా, టైటిల్ విజేత పాకిస్థానే అంటూ అభిమానులు ఊదరగొడుతున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరల్డ్ కప్‌లో ఎవరిది పైచేయి : కోహ్లీ ఆ ఆనవాయితీని రిపీట్ చేసేనా?