ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు మే 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా, ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో ఒక్క ఆటగాడు కూడా సెంచరీ నమోదు చేయలేదు. అలాగే, ఒకే మ్యాచ్‌లో ఏ ఒక్క ఆటగాడు కూడా రెండుకు మించిన క్యాచ్‌లు పట్టలేదు. కానీ, ఈ రెండింటిని ఇంగ్లండ్ ఆటగాళ్లు సాధించారు.
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ అద్భుతమైన సెంచరీ బాదాడు. వరుసగా వికెట్లు కోల్పోయిన తరపుణంలో బ్యాటింగ్‌కు దిగిన రూట్.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ సెంచరీ కొట్టాడు. మొత్తం 104 బంతులను ఎదుర్కొన్న రూట్... 107 పరుగులు చేశాడు. ఫలితంగా 2019 ప్రపంచ కప్ పోటీల్లో తొలి సెంచరీ సాధించిన క్రికెట్ హీరోగా తన పేరును లిఖించుకున్నాడు.
ఇదే మ్యాచ్‌లో మరో ఆటగాడు జోస్ బట్లర్ కూడా 76 బంతుల్లో సెంచరీ చేసి రెండో ఆటగాడిగా రికార్డు పుటలకెక్కాడు. ఇదిలావుంటే, 2015 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ తొలి సెంచరీ చేశాడు. 102 బంతుల్లో ఈ శతకం సాధించాడు.
మరోవైపు, ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ ఈ మ్యాచ్‌లో ఓ రికార్దు నెలకొల్పాడు. వరల్డ్‌కప్ ఒకే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకున్న నాలుగో ఫీల్డర్‌గా అరుదైన ఘనత సాధించాడు.
గతంలో భారత ఆటగాడు మహ్మద్ కైఫ్.. 2003లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో, పాక్ ఆటగాడు ఉమర్ అక్మల్ 2015లో ఐర్లాండ్‌పై, బంగ్లా ఆటగాడు సౌమ్య సర్కార్.. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు సాధించారు.