Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#Metooకి తర్వాత ట్రెండింగ్ అవుతున్న #KuToo

#Metooకి తర్వాత ట్రెండింగ్ అవుతున్న #KuToo
, మంగళవారం, 4 జూన్ 2019 (17:19 IST)
ఇదేంటి? #Metoo అంటే తెలుసుకానీ.. #KuToo అంటే ఏమిటి అనుకుంటున్నారు.. కదూ.. అయితే చదవండి. జపాన్ రచయిత, సినీనటి యుమి ఇషికావా ఆన్‌లైన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌లో హై-హీల్స్ ధరించడం అవసరమా? అనే ప్రశ్నను లేవనెత్తారు. కార్యాలయాలకు వెళ్తున్న మహిళలు హైహీల్స్ ధరించడం ఎంత మటుకు సరైందని ఆమె ప్రశ్నించారు. 
 
కొన్ని సంస్థలు డ్రెస్ కోడ్‌లో భాగంగా హైహీల్స్‌ను ధరించాలనే నియమాన్ని బ్యాన్ చేయాలని.. ఇందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఇషికావా డిమాండ్ చేశారు. ఇందుకోసం 20వేల మంది మహిళలు ఇషికావా వేసిన ఆన్‌లైన్ పిటిషన్‌కు మద్దతుగా సంతకాలు చేశారు. హై-హీల్స్ ధరించి ఉద్యోగాల్లో అసౌకర్యంగా పనిచేసే మహిళలు వున్నారని.. చెప్పుకొచ్చారు. 
 
కార్యాలయాల్లో మాత్రమే హైహీల్స్ ఉపయోగిస్తున్న మహిళలు ఇంటికొచ్చామో లేదో వాటిని విడిపించి ఫ్లాట్ స్లిప్పర్స్‌కు మారిపోయి.. హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారని.. ఇంకా హై-హీల్స్‌ను ప్రతిరోజూ ధరించడం ద్వారా వెన్నునొప్పి వంటి ఎముకలకు సంబంధిత రుగ్మతలు ఎదురవుతున్నాయని ఇషికావా వెల్లడించారు.
 
ఇకపోతే.. పురుషుల వస్త్రధారణ చూస్తే.. వారి డ్రెస్ సౌకర్యంగా వుందని.. కానీ మహిళల పరిస్థితి అలా కాదని..  డ్రెస్ కోడ్‌లోఈ లింగ వివక్ష ఎందుకని ఇషికావా ఆన్‌లైన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. హైహీల్స్ వంటి డ్రెస్ కోడ్ ద్వారా కార్యాలయ వాతావరణం మహిళలకు అనవసరమైన ఒత్తిళ్లకు తావిస్తున్నట్లుందని ఇషికావా చెప్పుకొచ్చారు.
 
ప్రస్తుతం #KuToo అంటూ ఇషికావా చేపట్టిన ఈ ఉద్యమం ట్రెండింగ్ అయ్యింది. kutsu అంటే జపాన్ భాషలో షూస్ (బూట్లు) అని అర్థం. ఇంకా kutsuu అంటే ''నొప్పి'' అని జపాన్ భాషలో అర్థం వస్తుంది. #KuToo హ్యాష్ ట్యాగ్‌ ద్వారా ఇషికావా చేపట్టిన ఈ విప్లవం ప్రారంభమైన 24 గంటల్లోనే వైరల్ అయ్యింది. 
 
ఇంకా ఈ వ్యవహారంపై ఇప్పటికే కార్మిక శాఖతో భేటీ అయినట్లు ఇషికావా వెల్లడించారు. హైహీల్స్‌ను తప్పకుండా ధరించాలని కొన్ని సంస్థలు లింగ వివక్ష దృష్ట్యా మహిళలపై ఒత్తిడి చేస్తున్నాయని ఇషికావా మీడియాతో చెప్పారు. ఇలా తప్పకుండా హై-హీల్స్ ధరించాలనే నియమాన్ని నిషేధించాలని ఆమె కార్మిక శాఖాధికారులను కోరినట్లు చెప్పుకొచ్చారు. హై-హీల్స్‌పై ఇషికావా లేవనెత్తిన ఉద్యమం ట్రెండింగ్ కావడంతో ఆరోగ్య శాఖ ఈ వ్యవహారంపై పరిశీలన చేపట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనసున్న మారాజు జగనన్న... బ్యానర్లు చూసి కాన్వాయ్ ఆపి...