Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాసా కాపాడు, తిరుమలలో చిరుతలు.. పాములు

Webdunia
గురువారం, 15 జులై 2021 (20:42 IST)
లాక్ డౌన్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గిన విషయం తెలిసిందే. ఈమధ్యే భక్తుల రద్దీ కాస్త పెరుగుతోంది. అయితే భక్తుల సందడి లేకపోవడం.. తిరుమల నిర్మానుష్యంగా మారిపోవడం.. ఘాట్ రోడ్లలో వాహన రాకపోకలు తక్కువగా ఉండడంతో జంతువులు రోడ్లపైకి వచ్చేస్తున్నాయి.
 
గత వారం చిరుత పులులు భక్తులకు కనిపించిన విషయం తెలిసిందే. రెండవ ఘాట్ రోడ్డులోని వినాయకుని గుడి దగ్గర చిరుత రోడ్డు దాటుతూ భక్తుల సెల్ ఫోన్‌కు దొరికింది. అలాగే  తిరుమలలోని సన్నిధానం సదన్-2 దగ్గర చిరుత ప్రత్యక్షమైంది. చిరుతపులుల తిరుగుతుండటంతో  భక్తులు భయాందోళనకు గురయ్యారు. 
 
అయితే తాజాగా పాములు కూడా భక్తులు తిరిగే ప్రాంతంలోకి వచ్చేస్తున్నాయి. తిరుమలలోని జిఎన్‌సి టోల్ గేట్ వద్ద అతి పెద్ద నాగుపాము రోడ్డుపైకి వచ్చేయడంతో భక్తులు గుర్తించి టిటిడి విజిలెన్స్ అధికారులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన టిటిడికి చెందిన పాములు పట్టే భాస్కర్ అక్కడికి చేరుకున్నారు.
 
అయితే నాగుపాము బుస్సలు కొడుతూ అక్కడి నుంచి వేగంగా వెళుతూ కనిపించింది. దీంతో పాముల భాస్కర్ నాగుపామును పట్టుకుని దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి వదిలేశాడు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమలలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఉండే జంతువులన్నీ రోడ్లపైకి వచ్చేస్తుండటంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments