Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల ఘాట్ రోడ్డులో మద్యం సేవిస్తూ వేగంగా కారు నడిపిన భక్తులు, ఆ తరువాత?

తిరుమల ఘాట్ రోడ్డులో మద్యం సేవిస్తూ వేగంగా కారు నడిపిన భక్తులు, ఆ తరువాత?
, బుధవారం, 14 జులై 2021 (21:03 IST)
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి మత్తుపదార్థాలను తీసుకెళ్ళకూడదు. ప్రత్యేకంగా టిటిడి ఇందుకోసం ఒక వింగ్‌ను ఏర్పాటు చేసింది. సొంత వాహనాల్లో వచ్చేవారు తిరుమలకు వెళ్ళాలంటే అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం పరిశీలించి పంపిస్తుంటారు. 
 
ప్రతి భక్తుడి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అలాగే భక్తులు తన వాహనాన్ని దిగి స్కానింగ్ చేసుకుని రావాల్సి ఉంటుంది. అలాంటిది ఒక భక్త బృందం ఏకంగా దీన్ని తప్పించుకుని వెళ్ళడమే కాదు.. ఘాట్ రోడ్డు మొత్తం మద్యం సేవించారు. అంతటితో ఆగలేదు తమ కారును వేగంగా ఘాట్ రోడ్డుతో నడుపుతూ కనిపించారు. 
 
ఐజీ కారునే ఓవర్‌టేక్ చేయడంతో అసలు విషయం బయటపడింది. నాగాలాండ్‌కు చెందిన ఒక భక్త బృందం తిరుపతిలోని అలిపిరి సప్తగిరి తనికీ కేంద్రం నుంచి దాటుకుని రెండవ ఘాట్ రోడ్డులోకి ప్రవేశించారు. ఘాట్ రోడ్డులో వెళుతూ కారులోనే ఒక ఫుల్ బాటిల్ మద్యం, సిగరెట్లు, స్నాక్ తీసుకుని తాగుకుంటూ వెళ్ళారు.
 
మత్తులో అతివేగంగా కారును నడుపారు. ఘాట్‌లో వెళుతున్న ఐజీ కారునే ఓవర్ టేక్ చేశారు. దీంతో ఐజి అనుమానంతో తిరుమల జిఎన్‌సి టోల్‌గేట్‌లో సమాచారమివ్వమని ఆదేశించారు. టిటిడి విజిలెన్స్ అధికారులు వాహనాన్ని ఆపగా మత్తు పదార్ధాలు కనిపించాయి.
 
దీంతో భక్త బృందాన్ని ప్రశ్నించగా ఘాట్ రోడ్డులో, తిరుమలలో మద్యం సేవించకూడదని తమకు తెలియదంటూ భక్త బృందం క్షమాపణ చెప్పింది. దీంతో విజిలెన్స్ అధికారులు భక్త బృందానికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లుడా మజాకా,10 కోట్ల విలువైన అత్త ఆస్తులను అక్రమంగా కాజేసిన అల్లుడు