Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్లుడా మజాకా,10 కోట్ల విలువైన అత్త ఆస్తులను అక్రమంగా కాజేసిన అల్లుడు

అల్లుడా మజాకా,10 కోట్ల విలువైన అత్త ఆస్తులను అక్రమంగా కాజేసిన అల్లుడు
, బుధవారం, 14 జులై 2021 (20:48 IST)
అత్తకు చెందిన రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, వ్యవసాయ భూములు, ఇళ్లు, పింఛన్లను కాజేసిన ఘరానా అల్లుడి ఉదంతం  తెనాలిలోని చిన్న పరిమీ గ్రామంలో వెలుగు చూసింది. అత్తకు  సంబంధించిన ఆస్తులన్నీ అక్రమంగా దోచుకున్న తర్వాత ఆమెను నడిరోడ్డుపై గెంటేసిన విషాదకర ఉదంతం ఇది.

బాధితురాలు విజయవాడ భరోసా సెంటర్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. తెనాలిలోని చిన్నపరిమి గ్రామానికి  చెందిన టీ తులసి 70 ఏళ్లు. పదేళ్ల క్రితం ట్రాన్స్కోలో ఉన్నతాధికారిగా పని చేస్తున్న పున్నారావు మృతి చెందాడు. తులసికి అదే గ్రామంలో ఏడు కోట్ల విలువ చేసే  రెండు చోట్ల వ్యవసాయ భూములు, కోటి విలువ చేసే ఇల్లు ఉంది.

అలాగే హైదరాబాద్లోని ఎల్బి నగర్లో కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది. ఈమెకు ఇద్దరు కూతుళ్లు చిన్న కూతురు ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్‌కు రాగా పెద్ద కూతురు శివ కుమారి ఆమె భర్త శ్రీనివాస్, తులసిని చూస్తున్నారు. తులసికి మగదిక్కు లేకపోవడం ఆసరాగా భావించిన అల్లుడు శ్రీనివాస్ ఆమె ఆస్తులపై కన్నేశాడు. పథకం ప్రకారం ఆమెను నమ్మించి ఒక్కొక్క ఆస్తిని అక్రమంగా అమ్మేసి కోట్లాది రూపాయలు దోచుకున్నాడు.

చివరకు తులసి ఉంటున్న ఇంటిని కూడా అక్రమంగా తన పేరుపై బదిలీ చేయించుకున్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకొని తులసి ఇటీవలె అల్లుడిని నిలదీసింది. ఇది జీర్ణించుకోలేని అల్లుడు ఆమెను కట్టుబట్టలతో ఇంట్లో నుంచి గెంటేశాడు. నడిరోడ్డుపై పడ్డ వృద్ధురాలైన తులసి విజయవాడలోని భరోసా సెంటర్ పోలీసులను ఆశ్రయించి తన అల్లుడిపై ఫిర్యాదు చేసింది.

తనకు తెలియకుండానే తనను నమ్మించి మభ్య పెట్టి తన ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేశాడు అని తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రతి నెల తనకు వచ్చే 50 వేల పింఛన్ డబ్బులకు సంబంధించి కూడా 10 ఏళ్ళ నుంచి తీసుకున్నాడు. ఏటీఎం కార్డు కూడా అతని వద్దే ఉందని ఆమె ఆరోపించింది. ఇలాంటి అల్లుడిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని తులసి పోలీసులను ప్రాధేయపడుతోంది. అలాగే తన ఆస్తులు తనకు వచ్చే విధంగా చేయాలంటూ వేడుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెన్నా నుంచి నా పేరు తొల‌గించండి: సీఎం జ‌గ‌న్