అతనో సాధారణ ఎలక్ట్రికల్ ఇంజనీర్... అతను జీతంతో పాటు గీతం కలిపి తాను సర్వీస్ చేసిన కాలంలో సంపాదిస్తే 2, 3 కోట్లు వుండొచ్చు. కానీ అతను సంపాదించిన ఆస్తులు చూసి ఇప్పుడు ఏసీబీ అధికారులులే షాక్ అవుతున్నారు. కొమ్మది ఎలక్ట్రికల్ ఏ. ఇ నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై నాగేశ్వరావు ఆస్తులకు సంబంధించి ఏసీబీ అధికారులు గురువారం ఆరు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
నాగేశ్వరరావుకు విశాఖలో సీతమ్మధార, సీతంపేట, విశాలాక్షి నగర్, ఎంవిపి కాలనీ, రాంబిల్లి ప్రాంతాలతో పాటు తెలంగాణ జిల్లాల్లో భూములు, ఇల్లు, స్థలాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే 3 బ్యాంకు లాకర్లు సీజ్ చేశారు. 1991 సర్వీసులో నాగేశ్వరరావు 94లో ఏసీబీ అధికారులకు చిక్కి సస్పెండ్ అయ్యారు.
2012లో తిరిగి విధుల్లో చేరిన నాగేశ్వరరావు లంచం ఇవ్వనిదే మీటర్ కనెక్షన్ కూడా మంజూరు చెయ్యరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ అధికారులు దగ్గర ఉన్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో వందల కోట్లు విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ దాడులు ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలా భాను నేతృత్వంలో విశాఖ డి.ఎస్.పి కె.రంగరాజు, ఏసీబీ అధికారులు పాల్గొని సోదాలు జరుపుతున్నారు.