Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 రికార్డులు నెలకొల్పిన ఆలూరు ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థినులు

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (19:33 IST)
చదువులోనే కాదు జాతీయ రికార్టులు నెల్పకొల్పడంలోనూ తాము ఎవరికీ తీసిపోమని నిరూపించారు గిరిజన విద్యార్థినులు. 2 ఆసియా బుక్ ఆఫ్ రికార్డులు, 9 ఇండియా బుక్ ఆఫ్ రికార్డులు... మొత్తం 11 రికార్డులు సాధించి ఔరా అనిపించారు కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన 8, 9వ తరగతి విద్యార్థినులు.

ఆంధ్రప్రదేశ్ ట్రైబుల్ రెసిడెన్సియల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ(ఏపీటీడబ్యూఆర్ఈఐఎస్) కార్యాలయంలో ఆసియా బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి డాక్టర్ వసుధా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల ప్రతినిధి జయసింహా సమక్షంలో బుధవారం తమ ప్రతిభను చూపి, రికార్డులు సాధించారు.

(ఏపీటీడబ్యూఆర్ఈఐఎస్) కార్యదర్శి శ్రీకాంత్ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా రాజాబాయి నేతృత్వంలోని గాయిత్రి బాయి, మంజు, అను వైష్ణవి బృంద సభ్యులు బ్లాక్ బోర్డుపై ప్రపంచ పటంలోని 205 దేశాలను 1 నిమిషం 15 సెకన్లలో గీసి జాతీయ రికార్డుతో పాటు ఆసియా రికార్డును సృష్టించారు.

ఈ 205 దేశాల పేర్లను 1 నిమిషం 15 సెకన్లలో చెప్పి రాజాబాయి నేతృత్వంలోని గాయిత్రి బాయి, మంజు, అను వైష్ణవి బృంద సభ్యులు  జాతీయ రికార్డుతో పాటు ఆసియా రికార్డును నెలకొల్పారు. ప్రపంచంలోని అన్ని దేశాలను 1 నిమిషం 20 సెకన్లలో చెప్పడం ద్వారా టి.అను వైష్ణవి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించింది.

భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల పేర్లను 14.22 సెకన్లలో చెప్పి బి.విజయలక్ష్మి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. 16.20 సెకన్లలో 118 మూలకాలను చెప్పడం ద్వారా ఎం.యువరాణి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. 8వ తరగతికి చెందిన వైకే శ్రీదేవి...60 క్యూబ్స్ ను ఒకే నిమిషంలో చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పింది.

మరో విద్యార్థిని జి.సూజాత...78 స్క్వేర్స్ ను ఒకే నిమిషం చెప్పడం ద్వారా ఆమె కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. నల్లబల్లపై ఒకే నిమిషంలో 40 క్యూబ్స్ ను రాయడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డును వైకే శ్రీదేవి సాధించింది.  57 స్క్వేర్స్ ను ఒకే నిమిషంలో నల్ల బోర్డుపై రాయడం ద్వారా జి.సూజాత మరో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పింది. 
 
గిరిజన విద్యార్థినుల ప్రతిభ ఆమోఘం...
11 రికార్డులు సాధించిన విద్యార్థినులకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి డాక్టర్ వసుధా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల ప్రతినిధి జయసింహా మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థినుల ప్రతిభ ఆమోఘమని వారు కొనియాడారు. గిరిజన బాలికలు మట్టిలో మాణిక్యాలని, అటువంటి వారిని వెతికిపట్టి శిక్షణ అందజేసిన ఆలూరు ఆంధ్రప్రదేశ్ గిరిజన గురకుల పాఠశాల ప్రిన్సిపాల్  సాయి కిశోర్ ను అభినందించారు.

విద్యార్థులు చదువుతో పాటు ఆటలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రికార్డులు సాధించిన గిరిజన విద్యార్థినులు భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పాలని అభిలషించారు. 
 
విద్యతో పాటు ఇతర అంశాల్లోనూ ప్రోత్సాహం...
కేవలం బోధనతో సరిపెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ట్రైబుల్ రెసిడెన్సియల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ(ఏపీటీడబ్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల విద్యార్థులకు వారికి ఇష్టమైన ఆటలతో పాటు ఇతర అంశాల్లోనూ ప్రోత్సహిస్తున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి శ్రీకాంత్ ప్రభాకర్ తెలిపారు. గిరిజన విద్యార్థినులు 11 రికార్డులు నెలకొల్పడం సాధారణమైన విషయం కాదన్నారు.

తాము ఏ విషయంలోనూ తీసిపోమని ట్రైబుల్ విద్యార్థినులు నిరూపించారని కొనియాడారు. తమ సొసైటీ  పరిధిలో 190 స్కూల్స్ ఉన్నాయని, అన్నింటిలోనూ విద్యార్థులకు ఆసక్తికరమైన అంశాలపై ప్రోత్సాహిస్తున్నామని తెలిపారు. విద్యార్థినుల అత్యుత్తమ ప్రతిభ వెనుక కళాశాల ప్రిన్సిపాల్ సాయి కిశోర్ ఉన్నారని అభినందించారు.

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ట్రైబుల్ రెసిడెన్సియల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ (ఏపీటీడబ్యూఆర్ఈఐఎస్) డిప్యూటీ సెక్రటరీ దయాకర్, ఆలూరుకు చెందిన ఆంధ్రప్రదేశ్ గిరిజన గురకుల పాఠశాల ప్రిన్సిపాల్ సాయి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments