Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌మ్యను హ‌త్య చేసిన శ‌శి కృష్ణ మీడియా ముందుకు...

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (15:46 IST)
బిటెక్ విద్యార్థిని ర‌మ్య‌తో ఆ ప్రేమోన్మాదికి ప‌రిచ‌యం కేవ‌లం 6 నెల‌లే. ఇస్టాలో పరిచ‌యం అయ్యాడు. ప్రేమ అని వెంట ప‌డ్డాడు. నిరాక‌ర‌ణ‌తో ఇలా హ‌త్యా ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. రమ్య శ్రీ హత్య కేసులో ముద్దాయిని గుంటూరు అర్బ‌న్ పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు.

గుంటూరు ర‌మ్య హ‌త్యోదంతాన్ని ఇన్ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ వివ‌రించారు. ఇన్ స్టాగ్రామ్ లో గత 6 నెలల క్రితం శశికృష్ణకి రమ్యతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి శశికృష్ణ రమ్యని తాను చదువుతున్న కాలేజ్ వద్ద కలుస్తూ, ప్రేమిస్తున్నానని వేధించాడు. ప్రేమకు ఆమె నిరాకరించడంతో శశికృష్ణ ఈ ఘతుకానికి ఒడిగట్టాడు.

మహిళలపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని గుంటూరు ఇన్ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ హెచ్చ‌రించారు. సోషల్ మీడియా పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాల‌ని, సోషల్ మీడియాలో పరిచయం అయ్యే వ్యక్తులకు దూరంగా ఉండాల‌ని సూచించారు. దీనికి ర‌మ్య హ‌త్య ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంద‌న్నారు. ర‌మ్య హ‌త్య కేసులో నిందితుడిని వెంట‌నే అరెస్ట్ చేసి, ఈ కేసులో ప్రతిభ కనపరచిన పోలీసులకు రివార్డులు ప్ర‌క‌టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments