Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీడా బి.టెక్ అమ్మాయిని ప్రేమించేది? ఇస్టా గ్రామ్ మాయాజాలం!!

వీడా బి.టెక్ అమ్మాయిని ప్రేమించేది? ఇస్టా గ్రామ్ మాయాజాలం!!
విజయవాడ , సోమవారం, 16 ఆగస్టు 2021 (14:45 IST)
ఫేస్ బుక్ లో ఇస్టా గ్రామ్ లో ప‌రిచ‌యం... ఎంతో అందంగా ఉంటుంది. అందులో కొటేష‌న్లు, ఫోటోలు చాలా మ‌నోహ‌రంగా ఉంటాయి. కానీ, నిజ జీవితంలో మ‌నుషుల స్వ‌భావాలు, గుణ‌గ‌ణాలు అంత‌కు మించి...వికారంగా, వికృతంగా ఉంటాయి.

ఈ వాస్త‌వాన్ని గ్ర‌హించ‌ని యువ‌త ఆక‌ర్ష‌ణ అనే మ‌త్తులో ప‌డి... అదే ప్రేమ‌గా భావించి, జీవితాల‌ను నాశనం చేసుకుంటున్నారు. ఒక్క యువ‌తే కాదు... వివాహిత మ‌హిళ‌లు కూడా, ఫేస్ బుక్ వంటి సోష‌ల్ మీడియా మాయాజాలంలో ప‌డి సంసారాల్ని, జీవితాల్సి నాశ‌నం చేసుకుంటున్నారు. అందుకే, ఏపీ డీజీపీ గౌతం స‌వాంగ్ కూడా...సోష‌ల్ మీడియా ప‌రిచ‌యాల‌తో తస్మాత్ జాగ్ర‌త్త అని యువ‌త‌ను హెచ్చ‌రించారు.

ర‌మ్య హ‌త్య కేసు ఈ కోవ‌కే చెందుతుంది. బిటెక్ చదువుతున్న ర‌మ్య అస‌లు శశికృష్ణని ఏం చూసి ప్రేమించింద‌ని, కేవ‌లం సోష‌ల్ మీడియా ప‌రిచ‌య‌మే ఆమె ప్రాణాల మీద‌కు తెచ్చింద‌ని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ప్రేమ పేరుతో ఉన్మాదాన్ని ప్ర‌ద‌ర్శించి... ఓ అమ్మాయి ప్రాణం తీసిన ప్రేమోన్మాది శశికృష్ణ అరెస్ట్ అరెస్ట్ అయ్యాడు. ర‌మ్య‌ను కిరాత‌కంగా క‌త్తితో పోట్లు పొడిచి చంపిన శశికృష్ణ ని ముప్పాళ్ళ మండలం గోళ్ళపాడు సేఫ్ కంపెనీ వ‌ద్ద పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకునే సమయంలో నిందితుడు ఆత్మహత్యకు యత్నించాడు. అయితే, పోలీసులు చాక‌చ‌క్యంగా అత‌డిని ప్రాణాల‌తో ప‌ట్టుకుని గుంటూరు పోలీసులు క‌స్ట‌డీ లోకి తీసుకున్నారు. అయితే, ఆత్మ‌హ‌త్య య‌త్నం స‌మ‌యంలో గాయ‌ప‌డిన అత‌డిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.

ప్రేమ పేరుతో ఉన్మాదాన్ని ప్ర‌ద‌ర్శించే శశికృష్ణ లాంటి ఆవారాల‌ను అమ్మాయిలు...అదీ చ‌దువుకున్న ర‌మ్య లాంటి బిటెక్ విద్యార్థిని ఏం చూసి ప్రేమిస్తార‌ని స్థానికులు ప్ర‌శ్నిస్తున్నారు. సోష‌ల్ మీడియా మాయాజాలంలో ప‌డి అంతా అభూత క‌ల్ప‌న‌లు అమ్మాయిలు, అబ్బాయిలు జీవితాల్ని నాశ‌నం చేసుకుంటున్నార‌ని పేర్కొంటున్నారు. క‌నీసం ఇలాంటి మాన‌వ మృగాల‌ను న‌మ్మి వారితో ఎలా ప్ర‌యాణం చేస్తార‌ని విస్మ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన నల్లపు వెంకటరావు కుమార్తె రమ్య (19) గుంటూరు సమీపంలోని సెయింట్‌ మేరీస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. నెల రోజుల క్రితం పరీక్షలు రాసేందుకు పెదకాకాని రోడ్డు పరమయ్యకుంటలోని నాయనమ్మ ఇంటికి వచ్చి అక్కడే ఉంటోంది. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఫేస్ బుక్ ద్వారా ఆమెకు వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన శశికృష్ణ తో పరిచయం ఏర్పడింది. అతను ప్రేమిస్తున్నానంటూ రమ్య వెంటపడేవాడు. ఆదివారం ఉదయం రమ్య బయటకు వెళ్లి నాయనమ్మకు టిఫిన్‌ తీసుకొచ్చింది. కొద్దిసేపటికే శశికృష్ణ ఫోన్‌ చేయగా, ఇప్పుడే వస్తానని నాయనమ్మతో చెప్పి బయలుదేరింది. రోడ్డుపైకి వచ్చిన రమ్య శశికృష్ణ బండి ఎక్కి రోడ్డు దాటి ముందుకు వెళ్లింది.

ఇంతలో అక్కడ ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో రమ్య బైకు దిగిపోయి రోడ్డు ఇవతలి పక్కకు వచ్చేసింది. శశికృష్ణ వెంటనే బైకు తిప్పి వచ్చి, రమ్యను చేత్తో రెండు దెబ్బలు కొట్టాడు. కింద పడిన ఆమెను తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా ఆరు పోట్లు పొడిచాడు.

ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం స‌మ‌యంలోనే ర‌మ్య ప‌రిస్థితిని గ‌మ‌నించి ఎవ‌రినైనా అస‌రా తీసుకుంటే బాగుండేది. అస‌లు నిందితుడు ఫోన్ చేసిన‌పుడే, అత‌నిని అనుమానించి, ఇంట్లోంచి బ‌య‌ట‌కు రాకుండా ఉంటే, ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. వ‌చ్చినా, ఇంకా శ‌శికృష్ణ‌ను న‌మ్మి అత‌ని బండిపైనే ఊరు చివ‌రి వంతెన వ‌ర‌కు ప్ర‌యాణించ‌డం విడ్డూరం. ఆ బండిపైనే వారిద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌ర‌గ‌గా, వంతెన దాటాక త‌ను బండి దిగి సెంట‌ర్ కి వ‌చ్చేసింది.

అపుడే ఆమె చుట్టుప‌క్క‌ల వారి స‌హాయం అర్ధించి ఉంటే, కొంచెం ప‌క్క‌వాళ్ళు అలెర్ట్ అయేవారు. కానీ, ఈలోపే శ‌శికృష్ణ బండిపై ఆమె వ‌ద్ద‌కు వ‌చ్చి బండి దిగి మ‌రీ ఆమెను కొట్టాడు. ఆ సమ‌యంలో టీస్టాల్ మొద‌లుకొని అంద‌రూ చూస్తూండ‌గానే, నిందితుడు త‌న జేబులోని క‌త్తి తీసుకుని హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఆ సమ‌యంలో చుట్టుప‌క్క‌ల వారు చొర‌వ తీసుకుని నిందితుడిని అడ్డుకుంటే, ర‌మ్య బ‌తికిపోయేది.

కానీ, నిందితుడు శశికృష్ణ క‌త్తి బ‌య‌ట‌కు తీసే స‌రికి అంతా దూరం జ‌రిగిపోయారు. దీనితో కొద్ది సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే నిందితుడు ర‌మ్య‌ను హత్య చేసి పరార‌య్యాడు. అయితే, అక్క‌డ షాపులో ఉన్న సీసీ కెమేరా విజువ‌ల్స్ నిందితుడిని గుర్తించి, ప‌ట్టుకోవ‌డంలో బాగా స‌హ‌క‌రించాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారా లోకేష్‌కు షాకిచ్చిన పోలీసులు : తొలిసారి అరెస్టు