Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష సూచన

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (13:31 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ఆదివారం, సోమవారాల్లో వ‌ర్షాలు పడే అవ‌కాశం ఉంద‌ని అమరావతి వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్ప‌డి, సముద్ర మట్టానికి 3.1 కిలో మీట‌ర్ల‌ ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది.
 
ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. ప‌లు చోట్ల‌ భారీ వర్షాలు కూడా కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. అంతేగాక‌, నవంబర్ తొలి వారంలో కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొంది.
 
నవంబర్‌ రెండో వారంలో బంగాళాఖాతంలో  అల్పపీడనం ఏర్పడనుందని, అది వాయుగుండంగా మారే అవ‌కాశాలూ ఉన్నాయ‌ని పేర్కొంది. అయితే, అది ఏపీ వైపు వస్తుందా? లేక దిశ మార్చుకుని వెళ్తుందా? అన్న విష‌యంపై పూర్తి స‌మాచారం లేద‌ని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments