Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా : రాహుల్ గాంధీ (వీడియో)

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (15:26 IST)
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష ఏపీ నేతలు ప్రారంభించారు. 
 
ఈ దీక్షకు రాహుల్ గాంధీ తన సంఘీభావాన్ని ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. 2019లో తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
 
అలాగే, ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ శ్రీవారి సాక్షిగా ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలు మర్చిపోయారా? అంటూ నిలదీశారు. కేంద్రం తెలుగువారికి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. 
 
విభజన హామీలన్నీ నెరవేర్చే వరకు రాజీలేని పోరాటం చేస్తామని మరో ఎంపీ అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. హోదా, రైల్వేజోన్, స్టీల్‌ప్లాంట్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర విత్తమంత్రి అరుణ్‌ జైట్లీతో చర్చల్లో పురోగతి లేదని ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు గురించి అడిగామన్నారు. జైట్లీ తెలుగు ప్రజల మనోభావాలను పట్టించుకోలేదని విమర్శించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments