Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమిత్ షా మనతో ఆటలాడుతున్నారా? నేతలతో చంద్రబాబు

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మనతో ఆట్లాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై చర్చించేందుకు న్యూఢిల్లీకి రావాలని స్వయంగా కోరిన ఆయన ఆ సమావేశానికి ఎందురు డుమ్మాకొట్టారంటూ

అమిత్ షా మనతో ఆటలాడుతున్నారా? నేతలతో చంద్రబాబు
, మంగళవారం, 6 మార్చి 2018 (09:58 IST)
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మనతో ఆట్లాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై చర్చించేందుకు న్యూఢిల్లీకి రావాలని స్వయంగా కోరిన ఆయన ఆ సమావేశానికి ఎందురు డుమ్మాకొట్టారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. 
 
ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, సమావేశానికి జైట్లీతో పాటు అమిత్ కూడా హాజరై ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సమావేశం వివరాలను ఎంపీ తోట నరసింహం చంద్రబాబుకు వివరించగా, కేంద్రం నుంచి అన్ని అంశాల్లో స్పష్టత రావాల్సి వుందని, స్పష్టత వచ్చేంతవరకూ పోరాటం ఆపవద్దని సూచించారు. రాష్ట్ర ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆయన, పార్లమెంటులో హోదా కోసం నిరసనలు తెలియజేస్తూనే ఉండాలని సూచించారు. 
 
పరిస్థితి ఇలాగేవుంటే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోనని స్పష్టంచేశారు. హోదా, రైల్వే జోన్ అంశాలు అసలు చర్చకే రాలేదని, కేవలం రెండు అంశాలను మాత్రమే ప్రస్తావించి, మిగతావి వాయిదా వేశారని టెలి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎంపీలు వెల్లడించారు. అన్నీ సాధించే వరకూ టీడీపీ వైఖరిలో మార్పు ఉండదని, ఈ విషయం కేంద్రానికి స్పష్టంగా తెలియజేయాలని ఆయన కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేం కూడా ప్రత్యేక హోదానే డిమాండ్ చేస్తున్నాం : బీజేపీ ఎంపీ హరిబాబు