Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిమ్మలను కూడా సమాధి చేస్తారు.. కమలనాథులకు చంద్రబాబు వార్నింగ్

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పాలకులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ప్రజల మనోభావలను ఏమాత్రం గౌరవించనందుకు కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు నామరూపాల్లేకుండా చేశారనే విషయాన్ని గుర్త

Advertiesment
మిమ్మలను కూడా సమాధి చేస్తారు.. కమలనాథులకు చంద్రబాబు వార్నింగ్
, మంగళవారం, 6 మార్చి 2018 (15:11 IST)
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పాలకులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ప్రజల మనోభావలను ఏమాత్రం గౌరవించనందుకు కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు నామరూపాల్లేకుండా చేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 
 
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, ఆయన మంగళవారం సభలో మాట్లాడుతూ, విభజన హామీలను తక్షణం అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో మిమ్మలన కూడా ఏపీ ప్రజలు సమాధి చేస్తారంటూ హెచ్చరించారు. ఏ రాష్ట్రానికీ హోదా లేదంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నామని స్పష్టంచేశారు. తెలుగువారితో ఆడుకున్న కాంగ్రెస్‌ పార్టీ అడ్రస్‌ లేకుండా పోయిందంటూ కాంగ్రెస్‌కు పట్టిన ఈ గతిని బీజేపీ గుర్తుంచుకోవాలి హెచ్చరించారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కు అది చేస్తాం.. ఇది చేస్తామంటున్నారు కానీ ఏదీ చేయడం లేదని కేంద్రం తీరును విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేదన్న ముఖ్యమంత్రి, ప్రజల మనోభావాలను కేంద్రం గౌరవించాలని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
 
భారతీయ జనతా పార్టీ తమ మిత్రపక్షం కాబట్టే శాంతియుతంగా పోరాటం చేస్తున్నామని తెలిపారు.బీజేపీ చేసిన మంచిపనుల గురించి తాము రాష్ట్ర ప్రజలకు చెప్పామన్నారు. అయితే, ఇప్పటికీ నెరవేర్చని హామీల అమలు కోసమే తమ పోరాటమని, ఈ విషయంలో ఎంతవరకైనా, ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ : చందా కొచ్చర్ - శిఖా శర్మలకు ఉచ్చు