Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశం రెండు ముక్కలవుతుంది : శ్రీశ్రీ రవిశంకర్

భారతదేశం రెండు ముక్కలు అవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, అయోధ్య వివాదం పరిష్కారం కానిపక్షంలో భారత్.. మరో సిరియా అవ

Advertiesment
Sri Sri Ravi Shankar
, సోమవారం, 5 మార్చి 2018 (16:20 IST)
భారతదేశం రెండు ముక్కలు అవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, అయోధ్య వివాదం పరిష్కారం కానిపక్షంలో భారత్.. మరో సిరియా అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. 
 
సిరియాలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశ అధ్యక్షుడికి, ప్రభుత్వ వ్యతిరేక శక్తులకు మధ్య జరుగుతున్న గొడవలో అమెరికా, రష్యాలు జోక్యం చేసుకున్నాయి. దీంతో ఆ దేశాల సైనిక దళాల దాడిలో వేలాది మంది ప్రజలు నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకుందామనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్, ఢిల్లీ, అయోధ్య, చెన్నై, లక్నో, బెంగళూరుకి చెందిన 500 మంది లీడర్లను వ్యక్తిగతంగా, వీడియో కాన్ఫ్‌రెన్స్ ద్వారా కలిసారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అయోద్య వివాదంపై ముస్లింలు తమ ఆరోపణలు నిరూపించాలని, అయోధ్య ముస్లింలకు నమ్మకమైన ప్రదేశం కాదన్నారు. వివాద ప్రదేశంలో దేవుడిని కొలవడాన్ని ఇస్లాం అనుమతించదన్నారు. వేరే ప్రదేశంలో రాముడు పుట్టాడని మనం చెప్పలేమన్నారు. అయోధ్య రామమందిరం వివాదం పరిష్కారం కాకపోతే భారత్ కూడా.. సిరియాలో మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్రహింసలు భరించలేక.. తాగుబోతు భర్తకు విషమిచ్చి...