రఘురామ రాజు కాలికి ఫ్రాక్చర్ : వైద్య పరీక్షలో వైద్యుల నిర్దారణ

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (14:33 IST)
వైకాపాకు చెందిన రెబల్ ఎంపీ రఘురామరాజు కాలికి ఫ్రాక్చర్ అయినట్టు సికింద్రాబాద్ ఆర్మీ అధికారులు సుప్రీంకోర్టుకు సమర్పించిన వైద్య నివేదికలో తేలింది. దీంతో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని రాజు తరపు న్యాయవాది డిమాండ్ చేశారు.
 
మరోవైపు, రఘురామ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. ఆర్మీ ఆస్పత్రి నివేదికను న్యాయమూర్తి వినయ్ చరణ్‌ చదివి వినిపించారు. రఘురామ పాదాలకి గాయాలున్నట్టు నిర్ధారణ అయ్యింది. మెడికల్‌ బోర్డు రిపోర్ట్‌కి, ఆర్మీ ఆస్పత్రి చెకప్‌కి మధ్య ఏదో జరిగిందని ప్రభుత్వం తరపు న్యాయవాది దవే అనుమానం వ్యక్తం చేశారు. 
 
కస్టడీలో చిత్రహింసలు నిజమేనని ఈ రిపోర్ట్‌లో తేలిందని పిటిషనర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు వివరించారు. రఘురామ తనకు తాను గాయాలు చేసుకున్నారని భావిస్తున్నారా..? అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 
 
మిలటరీ ఆస్పత్రి నివేదికను ఇరు పక్షాలకు మెయిల్‌ ద్వారా పంపిస్తామని ధర్మాసనం తెలిపింది. అనంతరం విచారణ సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది దవే కోరగా.. తక్షణమే విచారణ పూర్తి చేయాలని కోరిన రోహత్గీ కోర్టును కోరారు.
 
ఇలా రెండు వైపులా వాదనలు పూర్తయ్యాయి. అనంతరం విచారణను ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments