Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రఘురామకు ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స... సుప్రీంకోర్టు ఆదేశం

రఘురామకు ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స... సుప్రీంకోర్టు ఆదేశం
, సోమవారం, 17 మే 2021 (15:36 IST)
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్కడకు వైద్య పరీక్షల కోసం ఆయనను తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
ఆర్మీ ఆసుపత్రి వైద్య ఖర్చులను రఘురాజు భరించాలని చెప్పింది. ఈ పరీక్షల సమయాన్ని జ్యుడీషియల్ కస్టడీగానే భావించాలని పేర్కొంది. రఘురాజు వైద్య పరీక్షలను పర్యవేక్షించేందుకు జ్యుడీషియల్ ఆఫీసర్‌‌ను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించాలని ఆదేశించింది.
 
ఆర్మీ ఆసుపత్రి వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్‌లో అందించాలని సుప్రీంకోర్టు చెప్పింది. రఘురాజుకు చేసే పరీక్షలను వీడియోగ్రఫీ తీయాలని పేర్కొంది. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను ఏపీ చీఫ్ సెక్రటరీ పాటించాలని చెప్పింది. దీంతోపాటు ముగ్గురు సభ్యులతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 
 
సోమవారమే రఘురాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయనకు ఉన్న వై కేటగిరీ భద్రతను కొనసాగించాలని చెప్పింది. ఆయన మెడికల్ రిపోర్టును తెలంగాణ హైకోర్టు తమకు పంపాలని ఆదేశించింది. 
 
తాము తదుపరి ఉత్తర్వులను జారీ చేసేంత వరకు రఘురాజును ఆర్మీ ఆసుపత్రిలోనే ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పు కాపీ రాగానే రఘురాజును గుంటూరు నుంచి సికింద్రాబాదుకు తరలించనున్నారు. మరోవైపు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.100ల కోసం భార్యాభర్తల మధ్య గొడవ.. చివరికి ఏం జరిగిందంటే?