Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి వ్యవహారంలో నక్కా ఆనంద్ బాబు వాంగ్మూలం!

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (15:42 IST)
గంజాయి వ్యవహారంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు వాంగ్మూలం ఎట్ట‌కేల‌కు పోలీసులు రికార్డు చేశారు. ఆయ‌న‌పై కేసు నమోదు చేసిన పోలీసులు నోటీసులు అందించ‌గా, వాటిని తీసుకునేందుకు ఆనంద్ బాబు ససేమిరా అన్నారు. దీనితో  పెద్ద ప్ర‌హ‌స‌న‌మే న‌డిచింది.
 
ఏపీలో గంజాయి అక్రమ రవాణా, వినియోగం అడ్డుఅదుపు లేకుండా సాగుతోందని మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. గంజాయి వ్యవహారంపై మీరు ఏ ఆధారాలతో వ్యాఖ్యలు చేశారో ఆ ఆధారాలు తమకు ఇవ్వాలంటూ నర్సీపట్నం పోలీసులు గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్ళారు.  ఈ క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. 
 
విశాఖలో గంజాయి దందాకు సంబంధించి నక్కా ఆనంద్ బాబు వాంగ్మూలాన్ని పోలీసులు ఎట్ట‌కేల‌కు నేడు నమోదు చేసుకున్నారు. ఓ ప్రెస్ మీట్ లో నక్కా ఆనంద్ బాబు గంజాయి దందాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆనంద్ బాబు ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలను పోలీసులు తీవ్రంగా పరిగణించి, గత అర్ధరాత్రి ఆయన నివాసానికి చేరుకుని నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే నోటీసులు తీసుకునేందుకు ఆనంద్ బాబు నిరాకరించారు. దాంతో పోలీసులు ఈ ఉదయం మరోసారి ఆయన నివాసానికి వెళ్లారు. పోలీసుల తీరుపై నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓ మాజీ మంత్రినని, తన అభిప్రాయాలు చెప్పేంత స్వేచ్ఛ కూడా ఇవ్వరా? అని మండిపడ్డారు. ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా? పోలీసులకు ఆధారాలు ఇవ్వాల్సింది మేమా? అని నిలదీశారు. అయినా ప‌ట్టువీడ‌ని పోలీసులు ఆయ‌న వాంగ్మూలాన్ని సేక‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments