విశాఖ జిల్లా పెబ్బంపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి.
ఈ నెల 28 నుంచి ఆగస్టు మొదటి వారం వరకు అమరవీరుల వారోత్సవాలు ఉండటంతో పోలీసులు తనికీలు చేపడుతున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడగా ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరిపారు.
అనంతరం మావోయిస్టులు తప్పించుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టులు కోసం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.