మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. అయితే గంటల వ్యవధిలోనే చండీగఢ్ హైకోర్టు ఆదేశాలతో విడుదలయ్యాడు. గత సంవత్సరం జరిగిన లైవ్ చాట్‌లో ఓ వర్గం వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడని కేసు నమోదు కావడంతో యూవీని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు.
గతేడాది రోహిత్ శర్మతో జరిగిన లైవ్ చాటింగ్‌లో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిబ్రవరిలో హరియాణాలోని హన్సి నగర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఈ కేసులో యువీని హిస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయిన కాసేపటికి. చండీగఢ్ హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్ యువీ విడుదలయ్యాడు. అయితే గతంలోనే ఈ విషయంపై యువీ క్షమాపణలు చెప్పాడు.